NTV Telugu Site icon

DH Srinivasa Rao: సీజనల్ వ్యాధులతో జాగ్రత్త!

Dh Srinivasa Rao

Dh Srinivasa Rao

DH Srinivasa Rao Health Bulletin On Flood Affected Areas: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సమీక్షిస్తున్నామని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డా. శ్రీనివాస రావు చెప్పారు. భద్రాద్రి, చర్ల, దుమ్ముగూడెంలో 11 ప్రాధమిక ఆసుపత్రులు ఉన్నాయని చెప్పిన ఆయన.. 41 ఆరోగ్య కేంద్రాలు ఈ వరదలకు ఎఫెక్ట్ అయ్యాయని, 53 రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేశామని వివరించారు. మొత్తం 27 వేల మంది వరద బాధితులు ఉండగా.. ఇప్పటివరకూ 10,276 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. 119 గ్రామాలు వరదకు ఎఫెక్ట్ అయ్యాయని పేర్కొన్నారు.

106 మంది గర్భిణీ స్త్రీలను భద్రాచలం ఏరియా హాస్పిటల్‌కు తరలించామని, అక్కడే 60 మంది గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ చేశామని శ్రీనివాస రావు స్పష్టం చేశారు. వాటిలో 36 సాధారణ డెలివరీలు అయ్యాయన్నారు. 1028 మంది కోవిడ్ టెస్టులు చేయగా, ముగ్గురికి పాజిటివ్‌గా తేలిందన్నారు. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, 670 ఎడిషనల్ స్టాఫ్‌ను డిప్లోయ్ చేశామన్నారు. రాష్ట్ర & జిల్లా స్థాయి అధికారులు అందుబాటులో ఉన్నారని, ఆరోగ్య శిబిరాల్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. రిలీఫ్ సెంటర్ల నుండి ప్రజలు గ్రామాలకి వెళ్లిన తర్వాత అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని.. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని శ్రీనివాస రావు సూచించారు.