Site icon NTV Telugu

Rajanna Sircilla: పోటెత్తిన భ‌క్తులు.. రద్దీగా కల్యాణకట్ట

Rajanna Sirisilla Temple

Rajanna Sirisilla Temple

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వేముల‌వాడ రాజరాజేశ్వ‌ర క్షేత్రం ఆదివారం కావ‌డంతో భ‌క్తుల‌తో కిక్కిరిసింది. ప‌లు ప్రాంతాల నుంచి త‌ర‌లిరావ‌డంతో.. సర్వ‌ద‌ర్శ‌నం, శీఘ్ర‌ద‌ర్శ‌నం క్యూలైన్ల మీదుగా ఆల‌యానికి చేరుకున్నారు భ‌క్తులు. ఈసంద‌ర్భంగా ఇష్ట‌దైవ‌మైన రాజ‌రాజేశ్వ‌ర స్వామివారిని ద‌ర్శించుకుని త‌రించారు భ‌క్త‌జనం.

స్వామి వారికి ప్రీతిపాత్ర‌మైన కోడెమొక్కును ఎంతో భ‌క్తితో చెల్లిచుకున్నారు. ఆల‌యంలోని క‌ళాభ‌వ‌న్ లోని స్వామివారి నిత్య క‌ల్యాణం, స‌త్య‌నారాయ‌ణ వ్ర‌తం త‌దిత‌ర ఆర్జిత సేవ‌ల‌లో భ‌క్తులు భ‌క్తితో హాజ‌ర‌య్యారు. భ‌క్తులు వారి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించే భ‌క్తుల‌తో క‌ల్యాణ క‌ట్ట ర‌ద్దీగా మారింది. ఈ నేప‌థ్యంలో భ‌క్తులకు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఆల‌య ఈవో ఎల్‌. ర‌మాదేవి నేతృత్వంలో అధికారులు త‌గిన ఏర్పాట్లు చేశారు. గంట‌పాటు మ‌ధ్యాహ్నం వాన కుర‌వ‌డంతో భ‌క్తులు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇక యాదాద్రి శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ ఆల‌యానికి భ‌క్తులు ర‌ద్దీ కొన‌సాగుతోంది. నేడు ఆదివారం కావ‌డంతో నృసింహ స్వామిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. భ‌క్తులు త‌రలిరావ‌డంతో క్యూకాంప్లెక్యుల‌న్నీ నిండిపోయాయి. స్వామి ద‌ర్శ‌నానికి సుమారు నాలుగు గంట‌ల స‌మ‌యం ప‌డుతుండ‌టంతో భ‌క్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

ఒక‌వైపు వ‌ర్షం ప‌డుతుండ‌టంతో భ‌క్తులకు స్వామి ద‌ర్శనం ఇబ్బంది క‌రంగా మారింది. లోనికి వెళ్లేందుకు చాలా స‌మ‌యం వేచి చేయాల్సి వ‌స్తోంది. శ‌నివారం రాత్రి నుంచి వాన ప‌డుతుండ‌టంతో.. భ‌క్తుల వ‌ర్షానికి లెక్క చేయ‌కుండా స్వామి ద‌ర్శ‌నం కోసం త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో ఆదివారం యాదాద్రి భ‌క్తుల‌తో సంద‌డిగా మారింది. భ‌క్తులు ర‌ద్దీ కార‌ణంగా అధికారులు కొండ‌పైకి వామ‌నాల‌ను అనుమ‌తిలేదు. దీంతో వాహ‌నదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.

Asaduddin Owaisi: యూపీలో బీజేపీ విజయానికి కారకులు ఎవరు..?

Exit mobile version