NTV Telugu Site icon

Devotees to Temples: ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి నాలుగు గంటల సమయం

Yadadri

Yadadri

Devotees to Temples: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో నారసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు ఉదయం నుంచి భక్తులను క్యూ కాంప్లెక్స్‌లోకి అనుమతించారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం కాగా.. 150 రూపాయల ప్రత్యేక ప్రవేశ రుసుముతో దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read also: Prabhas: అభిమాని మరణిస్తే ప్రభాస్ చేసిన పనికి శబాష్ అనాల్సిందే..

అయితే.. శనివారం ఆలయ ఆదాయం రూ.62,55,860. ప్రసాదం విక్రయం ద్వారా రూ.19,15,350, వీఐపీ టిక్కెట్ల ద్వారా రూ.16.20 లక్షలు, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.9 లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. స్వామివారి సుప్రభాత విరామాన్ని చూసేందుకు కూడా భక్తులు పోటెత్తారు. ఇదిలా ఉండగా కొండపైకి వెళ్లే ఉచిత బస్సులు కిక్కిరిసిపోవడంతో భక్తులు మెట్ల మీదుగా కొండపైకి చేరుకుంటున్నారు. అదేవిధంగా కొండపైన కార్ పార్కింగ్ లేకపోవడంతో దిగువన పార్కింగ్ చేస్తున్నారు. మరోవైపు రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న క్షేత్రంలో ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. ఆదిదంపతుల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోందని, ఈరోజు, రేపు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు.
SRH vs KKR: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్.. పిచ్ రిపోర్ట్ ఇదే..!

Show comments