NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: హూవర్ డ్యామ్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: ఇవాళ నెవాడా-అరిజోనా రాష్ట్రాల సరిహద్దులోని హూవర్ డ్యామ్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. అక్కడ ఫెడరల్ ప్రభుత్వ అధికారుల బృందం ఆధ్వర్యంలో డ్యామ్ మొత్తం పర్యటించారు. విద్యుత్ ఉత్పత్తి యంత్రాంగాన్ని, మొత్తం నిర్మాణ వ్యవస్థను, కాలక్రమంలో నీటి అందుబాటుతో పాటు విద్యుత్ ఉత్పత్తి చరిత్రను ఆయన అధ్యయనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జల విద్యుత్ ప్రాజెక్టులతో హూవర్ డ్యామ్‌ను పోల్చి చూశారు. అలాగే, డ్యామ్ నిర్మాణంలో కార్మికుల భద్రతకు చేపట్టిన వివిధ భద్రతా చర్యలను, 1931 నుండి 1935 వరకు జరిగిన డ్యామ్ నిర్మాణ చరిత్రను డిప్యూటీ సీఎం అధికారుల బృందం పరిశీలించారు. ఇక రేపు సెప్టెంబర్ 27న, భట్టి బృందం అమెరికాలో అతిపెద్ద సింగిల్ సోలార్ మరియు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ అయిన ఎడ్వర్డ్స్, సాన్‌బార్న్ సోలార్ ఫెసిలిటీని సందర్శిస్తుంది. ఇక సెప్టెంబర్ 28న ఇన్వెస్టర్లు, సాంకేతిక నిపుణులతో సమావేశం కానుంది. మరుసటి రోజు (సెప్టెంబర్ 29) టోక్యో బయలుదేరుతారు.

తెలంగాణ ఏర్పడి పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పాలనలో తనదైన ముద్ర వేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల నుంచి పాలనలో భాగంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వరకు. ఇందులో భాగంగా భారీ కంపెనీలు, విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెట్టుబడులే లక్ష్యంగా భట్టి విక్రమార్క విదేశీ పర్యటన చేపట్టారు. నిన్న అమెరికాలోని లాస్ వేగాస్ లో ప్రారంభమైన అంతర్జాతీయ మైనెక్స్-2024 ప్రదర్శనలో పాల్గొని పలు అమెరికన్ కంపెనీల ప్రతినిథులతో సమావేశమైన విషయం తెలిసిందే.
Harsha Sai : పరారిలో యూట్యూబర్ హర్ష సాయి.. గాలింపు చర్యలు ముమ్మరం