Site icon NTV Telugu

Dengue Fever: ప్రబలుతోన్న డెంగీ.. 167 మందికి పాజిటివ్‌

Dengur

Dengur

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ దడ పుట్టిస్తోంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగు తున్న సమయంలో చాపకింద నీరులా డెంగీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో వానాకాలం సీజన్‌ మొదలైనా ఇంకా వర్షాలు కురవకముందే డెంగీ జ్వరాల బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు సీజన్స్‌కు అతీతంగా సిటీలో విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నగరంలో 167 డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. నగరవాసులు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా..
ఇక రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో డెంగీ ప్రభావం కనిపించనప్పటికీ.. ప్రస్తుతం రోజుకు సగటున 10–15 పాజిటివ్‌ కేసులు నమోద వుతున్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 167 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలోని సంపన్న ప్రాంతాల్లో సైతం కేసులు బాగా పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు.

డెంగీ దోమకి గుడ్డు పెట్టడానికి 10మి.లీ ద్రవం చాలు. కూలర్స్, ఫ్రిజ్‌లు, ఏసీలు తదితరాల నుంచి వృథా నీరు ఎప్పటికప్పుడు తొలగించకపోవడం, ఇళ్లల్లో ఇంటీరియర్‌ అందం కోసం ఎక్వేరియమ్స్‌ నీళ్లలో తాబేలు, ఫ్లవర్‌ పాట్స్‌ లాంటి డెకరేటివ్‌ ఉత్పత్తుల్లో నీళ్లు రోజూ మార్చకపోవడం దోమల విజృంభణకు కారణమవుతోంది. వేసవి సెలవులు కారణంగా.. ఊరు వెళుతున్నప్పుడు వారం, పదిరోజుల పాటు ఆ నీటిని అలాగే వదిలేస్తుండడం.. ఈ నిల్వ నీటిలో సులభంగా డెంగీ దోమ గుడ్లు పెడుతోంది.

ఆ తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాలో 42, కరీంనగర్‌ జిల్లాలో 39 కేసులున్నాయి. వరంగల్, సంగా రెడ్డి, రంగారెడ్డి, పెద్దపల్లి, నల్లగొండ, మేడ్చ ల్, మహబుబాబాద్, కొత్తగుడెం, ఖమ్మం, గద్వాల జిల్లాల్లో రెండంకెల సంఖ్యలో డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే డెంగీని సమర్థంగా ఎదుర్కోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

జాగ్రత్తలు:
ఖాళీ బీరు, విస్కీ తదితర బాటిల్స్‌ ఇంట్లో, మేడమీద ఎక్కడ పడితే అక్కడ పడవేయవద్దు. ఫ్లవర్‌ పాట్స్‌ కింద ఉంచే ప్లేట్స్‌ నుంచి నీటిని తొలగిస్తూ ఎప్పటిప్పుడు శుభ్రం చేస్తుండాలి. ప్రతి నాలుగైదు రోజులకోసారి ఇంట్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను శుభ్రం చేస్తుండాలి. పగిలిన వినియోగించని ప్లాస్టిక్‌ కంటైనర్లు, వాడేసిన కొబ్బరి చిప్పలు, పాత సామాన్లు పడేసే స్టోర్‌ రూమ్స్‌ దోమల నివాసాలని గుర్తించాలి.

Ramagundam Corporation: కార్పోరేటర్ల కబ్జాలు, బెదిరింపులు

Exit mobile version