Demonetisation Fraud Case: పాత నోట్ల మార్పిడి కేసులో సంచలన తీర్పు.!

  • పాత నోట్ల మార్పిడి కేసులో 11 మంది దోషులు
  • ప్రధాన నిందితుడికి మూడున్నరేళ్ల జైలు శిక్ష
  • 2017లో బేగంపేటలో వెలుగుచూసిన భారీ మోసం
  • అక్రమాలకు పాల్పడిన వారిపై కోర్టు కఠిన చర్యలు
Verdict

Verdict

పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) సమయంలో జరిగిన భారీ అక్రమాల కేసులో సికింద్రాబాద్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2017లో పాత కరెన్సీ నోట్లకు బదులుగా కొత్త నోట్లు ఇస్తామంటూ మోసాలకు పాల్పడిన 17 మంది ముఠాపై బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో పాత నోట్లను మార్చేందుకు అక్రమంగా రూ. 1.20 కోట్ల విలువైన కరెన్సీని బదిలీ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం మొత్తం 11 మందిని దోషులుగా తేల్చింది.

 

ఈ తీర్పులో ప్రధాన నిందితుడైన అంతతాలి యాదగిరికి కోర్టు రూ. 4.5 కోట్ల భారీ జరిమానాతో పాటు మూడున్నర ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసులో ప్రమేయం ఉన్న మిగతా 10 మంది దోషులకు రూ. 60 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. నోట్ల రద్దు సమయాన్ని ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడిన వారిపై కోర్టు ఈ స్థాయిలో కఠినంగా స్పందించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.