NTV Telugu Site icon

Delivery Boy: కుక్క దాడిలో డెలివరీ బాయ్ మృతి.. గత మూడు రోజులుగా కోమాలో..

Delevery Boy

Delevery Boy

Delivery Boy: స్విగ్గి డెలివరీకి వెళ్లి పెంపుడు కుక్క దాడి ఘటనలో డెలివరీ బాయ్ రిజ్వాన్ మృతి కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం బంజారాహిల్స్ లుంబిని రాక్ క్రిస్టల్ అపార్ట్మెంట్ కు రిజ్వాన్ ఫుడ్ డెలివరీకి వెళ్లాడు. డెలివరీ ఇచ్చే సమయంలో డోర్ ఓపెన్ చేయగా రిజ్వాన్ పై పెంపుడు కుక్క దాడి చేసింది. కుక్క దాడి నుంచి తప్పించుకునేందుకు థర్డ్ ఫ్లోర్ పై నుంచి రిజ్వాన్ కిందకు పడిపోయాడు. రిజ్వాన్ తలకు తీవ్ర గాయం కావడంతో నిమ్స్ కి తరలించారు. నాలుగు రోజులుగా కోమలోనే రిజ్వాన్ ఉన్నాడు. నిమ్స్ లో చికిత్స పొందుతూ రిజ్వాన్ నిన్న రాత్రి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు మృతదేహాన్ని తరలించారు పోలీసులు. బాధితుడి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు ప్లాట్ యజమాని పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసారు. మృతుడి పేరెంట్స్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. రిజ్వాన్ ఒక్కడే మా కుటుంబానికి ఉన్న ఆధారమని వాపోయారు. స్విగ్గిలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని కన్నీరుమున్నీరయ్యారు. మా కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నారు. ప్లాట్ ఓనర్ పై కేసు పెట్టామని, యజమానిని స్టేషన్ కి పిలిచి మాట్లాడుతామని పోలీసులు తెలిపారని అన్నారు..

Read also: Airport Metro: శరవేగంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణం.. 21 కిలోమీటర్లు సర్వే పూర్తి

కొద్ది రోజుల క్రితం (జనవరి 13)న బంజారాహిల్స్‌ రోడ్‌ నం.6లోని లుంబిని ర్యాక్‌ క్యాజిల్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న శోభన నాగాని.. ఈనెల 11వ తేదీన ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో మహ్మద్‌ రిజ్వాన్‌ అనే డెలివరీ బాయ్, పార్శిల్ ఇవ్వడానికి ఇంటికి చేరుకున్నాడు. బయట నిల్చొని డోర్ బెల్ కొట్టాడు. అయితే.. ఆ ఇంటి తలుపులు ముందునుంచే తీసి ఉంది. ఎవ్వరూ కనిపించకపోయేసరికి.. రిజ్వాన్ డోర్ బెల్ మోగించాడు. ఆ శబ్దం విని.. ఇంట్లో ఉన్న జర్మన్ షెపర్డ్ కుక్క ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఆ డెలివరీ బాయ్‌ని కరిచేందుకు ఎగబడింది. ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనకు గురైన రిజ్వాన్.. ఆ కుక్క నుంచి తప్పించుకునేందుకు పరుగు లంకించాడు. ఆ కుక్క తన వెంట పడటంతో, ఏం చేయాలో పాలుపోక మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. దీంతో రిజ్వాన్‌ తలకు తీవ్ర గాయాలయ్యాలయ్యాయి. కోమాలో వున్న రిజ్వాన్‌ నిన్న రాత్రి చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. దీంతో రిజ్వాన్‌ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Jharkhand: శృంగారం చేస్తూ దొరికిపోయిన భార్య, ప్రియుడు.. తల నరికేసిన భర్త

Show comments