Delivery Boy: కుక్క దాడిలో డెలివరీ బాయ్ మృతి.. గత మూడు రోజులుగా కోమాలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delivery Boy: స్విగ్గి డెలివరీకి వెళ్లి పెంపుడు కుక్క దాడి ఘటనలో డెలివరీ బాయ్ రిజ్వాన్ మృతి కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం బంజారాహిల్స్ లుంబిని రాక్ క్రిస్టల్ అపార్ట్మెంట్ కు రిజ్వాన్ ఫుడ్ డెలివరీకి వెళ్లాడు. డెలివరీ ఇచ్చే సమయంలో డోర్ ఓపెన్ చేయగా రిజ్వాన్ పై పెంపుడు కుక్క దాడి చేసింది. కుక్క దాడి నుంచి తప్పించుకునేందుకు థర్డ్ ఫ్లోర్ పై నుంచి రిజ్వాన్ కిందకు పడిపోయాడు. రిజ్వాన్ తలకు తీవ్ర గాయం కావడంతో నిమ్స్ కి తరలించారు. నాలుగు రోజులుగా కోమలోనే రిజ్వాన్ ఉన్నాడు. నిమ్స్ లో చికిత్స పొందుతూ రిజ్వాన్ నిన్న రాత్రి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు మృతదేహాన్ని తరలించారు పోలీసులు. బాధితుడి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు ప్లాట్ యజమాని పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసారు. మృతుడి పేరెంట్స్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. రిజ్వాన్ ఒక్కడే మా కుటుంబానికి ఉన్న ఆధారమని వాపోయారు. స్విగ్గిలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని కన్నీరుమున్నీరయ్యారు. మా కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నారు. ప్లాట్ ఓనర్ పై కేసు పెట్టామని, యజమానిని స్టేషన్ కి పిలిచి మాట్లాడుతామని పోలీసులు తెలిపారని అన్నారు..
Read also: Airport Metro: శరవేగంగా ఎయిర్పోర్ట్ మెట్రో నిర్మాణం.. 21 కిలోమీటర్లు సర్వే పూర్తి
Also Read
- Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్‌ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
కొద్ది రోజుల క్రితం (జనవరి 13)న బంజారాహిల్స్ రోడ్ నం.6లోని లుంబిని ర్యాక్ క్యాజిల్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న శోభన నాగాని.. ఈనెల 11వ తేదీన ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో మహ్మద్ రిజ్వాన్ అనే డెలివరీ బాయ్, పార్శిల్ ఇవ్వడానికి ఇంటికి చేరుకున్నాడు. బయట నిల్చొని డోర్ బెల్ కొట్టాడు. అయితే.. ఆ ఇంటి తలుపులు ముందునుంచే తీసి ఉంది. ఎవ్వరూ కనిపించకపోయేసరికి.. రిజ్వాన్ డోర్ బెల్ మోగించాడు. ఆ శబ్దం విని.. ఇంట్లో ఉన్న జర్మన్ షెపర్డ్ కుక్క ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఆ డెలివరీ బాయ్‌ని కరిచేందుకు ఎగబడింది. ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనకు గురైన రిజ్వాన్.. ఆ కుక్క నుంచి తప్పించుకునేందుకు పరుగు లంకించాడు. ఆ కుక్క తన వెంట పడటంతో, ఏం చేయాలో పాలుపోక మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. దీంతో రిజ్వాన్ తలకు తీవ్ర గాయాలయ్యాలయ్యాయి. కోమాలో వున్న రిజ్వాన్ నిన్న రాత్రి చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. దీంతో రిజ్వాన్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Jharkhand: శృంగారం చేస్తూ దొరికిపోయిన భార్య, ప్రియుడు.. తల నరికేసిన భర్త
తాజావార్తలు
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
-
Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
-
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
-
Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!