NTV Telugu Site icon

Degree student suicide: 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. కారణం తెలిసి తల్లడిల్లిన తల్లిదండ్రులు

Warangal Student Susaid

Warangal Student Susaid

Degree student suicide: ఈ కాలంలో యువత చిన్న చిన్న విషయాలకే పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏందో వారు చేసేదే కరెక్ట్ అంటూ చిన్న పాటి విషయాలు వారికి పెద్దగా కనపడుతున్నాయి. దీంతో వారు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక మరికొందరైతే తమ బాధలను తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఉరితాడితో తనువు చాలిస్తున్నారు. ఇటువంటి ఆత్మహత్యలు ఇలా రోజురోజుకూ పెరుగుతున్నాయి. 19 ఏళ్ల యువతి హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ చదువుతుంది. అయితే అమ్మా, నాన్న చేయించిన ఉంగరం ఇటీవల పోయింది. ఇక ఉగాది సెలవులకు ఇంటికి వెళ్లింది దీంతో ఉంగరం పోయిందని తెలుస్తే తల్లిదండ్రులు తిడతారని భయపడింది. ఏం చేయాలో తెలియక చివరకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుంది ఈ ఘటన వరంగల్ జిల్లా గున్నెపల్లి గ్రామంలో కలకలం రేపింది.

Read also: MP Nandigam Suresh: అచ్చెన్న హత్యపై రాజకీయం తగదు.. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది..!

వరంగల్ జిల్లా గున్నేపల్లి గ్రామానికి చెందిన మద్దుల జానకీ రామ్ కు 19 ఏళ్ల మద్దుల హేమలతా రెడ్డి కూతురు ఉంది. హేమలతా హన్మకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా..ఇంటి నుంచి వెళ్లి రావడం కష్టంగా ఉందని హాస్టల్ లో ఉండి చదువుకుంటోంది. అయితే.. ఇటీవలే ఉగాది పండుగ కోసం ఇంటికి వచ్చిన హేమలతా రెడ్డికి వున్న చేతి ఉంగరం పోయింది. హేమలతా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఉంగరం పోయిందని తల్లిదండ్రులు ఏమంటారోనని భయపడింది. తిడతారేమో అని భావించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్‌ నోట్‌ రాసింది. అందులో అమ్మా, నాన్నా నన్ను క్షమించండి ఉంగరం పోగొట్టుకున్నాను. అది తెలిస్తే మీరేమంటారోనన్న భయంతోనే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని తెలిపింది. అనంతరం వెంటనే ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు షాక్‌ కు గురయ్యారు. కూతురు ఫ్యాన్‌ వేలాడుతూ కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. కారణం ఏముంటుందనీ భావించినా తరువాత సూసైడ్‌ లెటర్‌ లో హేమలతా రాసిన రాతను చూసి అయ్యె తల్లీ వేల రూపాయల విలువ చేసే ఉంగరం కోసం కోట్ల రూపాయల విలువ చేసే ప్రాణమెలా తీసుకున్నావు అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఇది చిన్న విషయమే కదా.. అంతగా ఎందుకు భయపడి మాకు అందనంత దూరమవుతావా అంటూ రోధిస్తున్నతీరు స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.
Meter Trailer: వాడు బాల్ లాంటోడు.. ఎంత కొడితే అంత పైకి లేస్తాడు