Site icon NTV Telugu

Mother Agony: కొడుకు కోసం తల్లి ఆరాటం.. మృత్యువుతో పోరాడుతున్న కన్నబిడ్డ

Mother Agony

Mother Agony

Mother Agony: రాయదుర్గం పీఎస్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాయదుర్గం చిత్రపురి కాలనిలో ఆడుకుంటున్న బాలుడిని కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో హుటా హుటిన బాలుడ్ని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బాలుడి పరిస్థి తీవ్రంగా ఉందని వైద్యుల తెలుపడంతో ఆతల్లి కంట కన్నీరు ఆగలేదు.. భర్త కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆతల్లికి కొడుకు పరిస్థితి కూడా ఇలాఉండటంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అసలు ఏం జరిగింది…

హైదరాబాద్‌ లోని రాయదుర్గం పీఎస్ పరిధిలో చిత్రపురి కాలనీలోని చిత్రపురి HIG-5- 705 లో సాయి శ్రావణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి జీవాన్ష్ అనే బాలుడు వున్నాడు. HIG లో మెంటనెన్స్ మేనేజర్ గా సాయి పనిచేస్తూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు. అన్యోన్యంగా సాగుతున్న వారి కుటుంబంలో మృత్యువు కబలించింది. సాయి మృతువాత పడ్డాడు. దీతో శ్రావణి షాక్‌ లోకి వెళ్లి పోయింది. తన భర్తను కోల్పోయి తీవ్ర విషాదంలో వున్న కుటుంబానికి జీవాన్ష్ ను కోసం బతకాలని పించింది. తను పెరిగి పెద్దై తనను పోషించి తల్లికి అండగా ఉండాటనే నమ్మకంతో వున్న ఆతల్లికి మళ్లీ తీరని సోకంలో మునిగింది. అదే తన కొడుకు జీవాన్ష్. జీవాన్‌ 5-6 బ్లాక్ మధ్యలో కూర్చొని ఆడుకుంటున్న సమయంలో సెల్లార్ నుండి పైకి వచ్చిన కారు బాలుని తలకు తాకుతూపోయింది. దీంతో జీవాన్ష్ కు తీవ్ర గాయాలయ్యాయి. జీవాన్ష్ అకమ్మారక స్థితిలో వెళ్లిపోయాడు. స్థానికులు హుటిన జీవాన్ష్ ను ఆసుప్రతికి తరలించారు. అయితే జీవాన్ష్ పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవలే బాలుడి తండ్రి సాయి మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో వెళ్లిపోయింది. ఇంటి పెద్దను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉన్న కుటుంబానికి మరో దెబ్బ తగలడంతో తల్లిడిల్లుతున్న ఆతల్లి కంట కన్నీరు ఆగలేదు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో వుండి కొడుకే దిక్కు అనుకున్న తల్లి శ్రావణి బాధ వర్ణతీతంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. సీసీఫోటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఇంటిపై దాడి.. ఇది నాల్గవసారి అంటూ సీరియస్

Exit mobile version