Site icon NTV Telugu

Women’s reseravation bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ.. బీఆర్ఎస్ ఏంపీల వాయిదా తీర్మానం

Women's Reseravation Bill

Women's Reseravation Bill

women’s reseravation bill: మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్ఎస్ ఉద్యమం ఉధృతం చేసింది. నేడు లోక్ సభ లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్. అఖిలపక్ష సమావేశం నిర్వహించి మహిళ రిజర్వేషన్ బిల్లుపై చర్చించాలని ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత ఈ తీర్మానం నోటీసులు అందజేశారు. త్వరలో దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలకు ఎమ్మెల్సీ కవిత ప్రణాళికలు రూపొందించారు. మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు కల్వకుంట్ల కవిత పోస్టు కార్డులు రాశారు. మహిళా రిజర్వేషన్ల కోసం గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో, ఆయా మహిళా, సంఘాలతో సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం విధితమే.

Read also: Rahul: దుబాయ్ లో సాంగ్ చేశా… ఫర్ ఏ చేంజ్ ఈసారి పాన్ ఇండియా రేంజులో

ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో పాటు పలు పార్టీల నేతలు డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విస్మరించినందున ఆందోళనని మరింత తీవ్ర రూపం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నారు. మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతోపాటు దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు నిర్వహించారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా కవిత ప్రణాళిక రూపొందించారు. మహిళలకు సాధికారత కల్పిద్దాం, దేశానికి సాధికారత కల్పిద్దాం మంటూ మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండని కవిత పిలుపు నిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదని పోస్టర్ లో పేర్కొన్నారు. మహిళా బిల్లు ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా ఆమె సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టర్ ను విడుదల చేయడంతో ఈ పోస్ట్ కాస్తా వైరల్ మారింది.
Saudi Arabia: ఘోర బస్సు ప్రమాదం… 20 మంది యాత్రికులు దుర్మరణం

Exit mobile version