విపరీతంగా తలనొప్పి బాధిస్తున్నప్పుడు తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. ఇక ఆ చిట్కాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
బాగా తలనొప్పి తో బాధపడుతున్న వారు తలనొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం అల్లం ఉపయోగిస్తే మంచిదని చెబుతున్నారు.
ఒత్తిడిని, తలనొప్పిని, ఒంటి నొప్పులను తగ్గించడంలో అల్లం రసం బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.
అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపి తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు. అంతేకాదు తలనొప్పి తగ్గాలంటే దాల్చినచెక్క కూడా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
దాల్చినచెక్క పొడిగా చేసి కాస్త నీళ్లలో కలిపి ఆ పేస్ట్ నుదుటిపైన దాల్చినచెక్క పట్టులాగా వేస్తే తలనొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.
నుదుటికి రాసుకున్న దాల్చినచెక్క పేస్టును అరగంట పాటు ఉంచుకుని ఆ తర్వాత వేడినీళ్లతో కడిగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
తలనొప్పి నివారణ కోసం మసాజ్ కూడా ఒక మంచి మంత్రంలా పనిచేస్తుంది. తలనొప్పి ఎక్కువగా ఉన్నవారు మసాజ్ చేసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
మెడ తల భాగాన్ని నొక్కుతూ మెల్లమెల్లగా మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరిగి రిలాక్స్ అవుతారు. నొప్పి కూడా దూరమవుతుంది.
తాజా ద్రాక్ష పండ్లను తీసుకొని జ్యూస్ చేసి తాగడం వల్ల కూడా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ జ్యూస్ ను రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
డయాబెటిస్ బాధితులు మాత్రం ద్రాక్ష పండ్ల జ్యూస్ ను తాగకూడదు. మొత్తంగా తలనొప్పి నివారణకు ఈ చిట్కాలను పాటించి ఉపశమనం పొందాలని చెబుతున్నారు.