టీఆర్ఎస్ పార్టీ కి ఇంద్రవెల్లి సభతో చురుకు తగిలింది. కలుగులో నుంచి ఒకొక్కరు బయటకు వస్తున్నారు అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉండి… నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు సరికాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు కత్తులు…కటారులు పట్టుకుని తిరుగుతున్నారా…నాలుకలు కోస్తాం అంటున్నారు.. మాకు కత్తులు దొరకవా…. మేము నాలుకలు కోయలేమా. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం…. మీరు జైలుకు వెళ్లడం తథ్యం అని తెలిపారు.
ఇప్పుడు ప్రతి పక్షంగా…. మేము ప్రశ్నిస్తాము. వివరణ ఇచుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీది. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. ఎదురు దాడులు చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డుకు బియ్యం తెచ్చుకుని తినేవారికి బెంజ్ కార్లు ఎలా వచ్చాయి. రేవంత్ రెడ్డి జైలు కు వెళతారని అంటున్నారు. మీ భాగోతాలు మాకు తెలియవా మేము బైట పెట్టలేమా… రాజకేయాలను నీచమైన సంస్కృతికి జిగజారాయి. ఏడేళ్లుగా దళిత, గిరిజన ప్రజల నోట్లో మన్ను కొట్టారు. ఇవాళ ప్రజలను మభ్య పెడుతున్నారు. సమష్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నాము. ఉద్యోగ ఖాళీల విసములో… ఎందుకు ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడతారు అని అడిగారు.