Site icon NTV Telugu

Dasoju Sravan: కేసీఆర్‌ది దొంగదీక్ష.. రైతుల్ని దగాచేసే కుట్ర

Dasoju Sravan Kumar

Dasoju Sravan Kumar

తెలంగాణ రైతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దగాచేస్తున్నాయని మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) సీఎం కేసీఆర్‌వి వికృత చేష్టలు. క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీలో కేసీఆర్ ది దొంగ దీక్ష.. . రైతులను దగా చేసే కుట్ర అన్నారు. రంగస్థలం సినిమాలో జగపతి బాబు లెక్క… కేసీఆర్ తయారయ్యారన్నారు శ్రవణ్.

బీజేపీ..టీఆర్‌ఎస్‌లు డ్రామాలు చేస్తున్నాయి. ఇద్దరూ ధర్నాలు చేస్తే… రైతులను ఆదుకునేది ఎవరు .? ఉప్పుడు బియ్యం ఇవ్వం అని చెప్పింది కేసీఆర్ కాదా అన్నారు. బీజేపీ .. ఇందిరా పార్క్ లో దీక్ష చేసుడు కాదు..కేసీఆర్‌ లేని సమస్యను సృష్టించి… నేనే పరిష్కారం చేసినట్టు నటించడం అలవాటు. కేబినెట్ మీటింగ్ లో వరి ధాన్యం నేనే కొంటా అని తీర్మానం చేస్తాడు కేసీఆర్. ఇప్పటికే 30 శాతం ధాన్యం అమ్మి మోసపోయాడు రైతు. వారికి మద్దతు ధర ఎవరు ఇవ్వాలి.
మానవత్వం ఉంటే.. కేబినెట్ లో నష్టపోయిన రైతుని ఆదుకోవాలన్నారు దాసోజు శ్రవణ్.

ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ (Madhu Yaski Goud) కేసీఆర్‌ పై నిప్పులు చెరిగారు. పంది కొక్కుల లెక్క మెక్కి.. రైతుల కోసం దీక్ష అని నాటకం అడారు టీఆర్ఎస్ నేతలు అన్నారు మధుయాష్కీ. 24 గంటల్లో కేసీఆర్ వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కేసీఆర్ రైస్ మిల్లర్ల తో కుమ్మక్కు అయ్యారని ఆయన ఆరోపించారు. తెలంగాణ పాలిట కేసీఆర్ ఓ శాపం. రైతు బంధు పేరుతో రైతుకు ఐదు వేలు ఇచ్చి..పది వేలు కొల్ల గొడుతున్నారు. ధర్నాలతో దగా చేస్తున్నారు కేసీఆర్. కాంగ్రెస్ కార్యకర్తలు..ప్రజల్ని చైతన్యవంతులను చేయాలన్నారు.

https://ntvtelugu.com/mlc-kavitha-deadline-on-paddy-issue/

Exit mobile version