Site icon NTV Telugu

Dasoju Sravan : అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తాం ..

Dasoju Sravan

Dasoju Sravan

మరోసారి టీఆర్‌ఎస్‌ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ నేతల ఆస్తులు విచ్చల విడిగా పెరుగుతున్నాయని, తెలంగాణ కోసం పోరాడిన పేదొడు పేదొడిగానే మిగిలిపోయాడంటూ ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి ఎకరాకు పైగా భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం దుర్మార్గమని, వంద కోట్ల విలువైన భూమిని ఎలా టీఆర్ఎస్ పార్టీకి కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ భవన్‌కు కూత వేటు దూరంలో మళ్ళీ అదే పార్టీకి ఎకరాకు పైగా భూమి ఎందుకు కేటాయిస్తున్నారని, సీఎస్ సోమేష్ కుమార్ ప్రభుత్వం సొమ్మును టీఆర్ఎస్‌కు దారాదత్తం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనుకకు తీసుకునే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని, అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తామన ఆయన వెల్లడించారు.

ఆ స్థలంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టాలని, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ దీనిపై ఎందుకు స్పందించరని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ భవన్ స్థలాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని, అక్కడ టీఆర్ఎస్ ఒక ఛానల్ నడుపుతున్నారన్నారు. 8 సంవత్సరాల్లో వెయ్యి కోట్లు సంపాదించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీదని, టీఆర్ఎస్ పేదల సొమ్మును దోచుకుంటున్నారన్న శ్రవణ్‌.. ప్రజలు టీఆర్ఎస్ నేతల దోపిడీపై రోడ్లపై నిలదీయాలన్నారు.

Exit mobile version