Dasoju Sravan: మిగతా లక్ష ఉద్యోగాల సంగతేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమయిందని మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు.. మరి మిగతా లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఇది 40లక్షల కుటుంబాల సమస్య. తెలంగాణ లో నిరుద్యోగ ఎమర్జెన్సీని ప్రకటించండి. 90 వేల ఉద్యోగాలు ఇచ్చి 39లక్షల మంది నోట్లో మట్టి కొడుతున్నారు.
నిరుద్యోగం పై లోతైన చర్చ జరగాలి…అఖిలపక్షంతో చర్చించాలన్నారు. నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. నిరుద్యోగ భృతిని ఎవరు అడ్డుకుంటున్నారు..ఎందుకు అమలు చేయట్లేదో చెప్పాలన్నారు. ప్రైవేటు రంగంలో 95శాతం ఉద్యోగాలు తెలంగాణ వాళ్శకే ఇస్తే..నేను కూడా కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తానన్నారు. యువత లో స్కిల్ డెవలప్ మెంట్ బాధ్యత ప్రభుత్వం పై ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లు పెట్టాలి. ఫీల్డ్ అసిస్టెంట్ లను రెండు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. 70 మంది ఫీల్డ్ అసిస్టెంట్ లు చనిపోయారు. వివిధ శాఖల లో తొలగించిన మిగతా 42వేల మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని శ్రవణ్ డిమాండ్ చేశారు.
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
చనిపోయిన ఫిల్డ్ అసిస్టెంట్ ల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలి. ఫీల్డ్ అసిస్టెంట్ ల అందరికీ రెండు సంవత్సరాల జీతం ఇవ్వాలి. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోసం వివిధ శాఖలకు దరఖాస్తు చేసిన అప్లికేషన్ లను క్లియర్ చేయాలి. నా దగ్గర ఉన్న సమాచారం తో సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తానన్నారు శ్రవణ్. చదువుకున్న ప్రతి నిరుద్యోగి అన్ని పరిక్షలు రాసేలా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలన్నారు దాసోజు శ్రవణ్.
తాజావార్తలు
-
Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్
-
Jananayagan : జననాయకుడు కోసం ఆంధ్ర, నైజాంలో విచ్చలవిడిగా థియేటర్స్, షోస్ పరిచేసారు
-
IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
-
Rohit-Kohli: ఏంటి తమాషానా.. అభిమానులు ఊరుకుంటారా.. స్టేడియం పైకప్పే లేచిపోతుంది!
-
CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!