Site icon NTV Telugu

Liquor Sales : దసరా సీజన్‌లో భారీగా మద్యం సేల్స్.. ఎన్ని కోట్లో తెలుసా..?

Fake Liquor

Fake Liquor

Liquor Sales : దసరా పండుగ సీజన్‌ సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 సెప్టెంబర్ నెలలోనే రూ.3,048 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన రూ.2,838 కోట్లతో పోలిస్తే సుమారు 7 శాతం అధికం. ఈ పెరుగుదలతో ఎక్సైజ్ శాఖకు కొంత ఊరట లభించింది.

Scuba Diving: స్కూబా డైవింగ్ ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్.. ఎలాగంటే..!

లిక్కర్ అమ్మకాలు బాగా పెరిగినప్పటికీ, బీరు అమ్మకాల్లో మాత్రం కొంత తగ్గుదల కనిపించింది. 2024 సెప్టెంబర్‌లో 28.81 లక్షల కేసుల ఐఎంఎల్ లిక్కర్ అమ్ముడవగా, ఈ ఏడాది అదే కాలంలో 29.92 లక్షల కేసుల విక్రయాలు జరిగాయి. అయితే బీరు విషయంలో గత ఏడాది 39.71 లక్షల కేసులు అమ్ముడవగా, ఈసారి 36.46 లక్షల కేసులు మాత్రమే విక్రయమయ్యాయి. పండుగ సీజన్ ప్రభావంతో లిక్కర్ అమ్మకాలు గణనీయంగా పెరగడం గమనార్హం.

అదే సమయంలో దసరా ముందు రోజులలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. సెప్టెంబర్ 29న ఒక్క రోజే రూ.278 కోట్ల అమ్మకాలు నమోదవగా, సెప్టెంబర్ 30న రూ.333 కోట్లు, అక్టోబర్ 1న రూ.86.23 కోట్లు విక్రయాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లోనే గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 60 నుంచి 80 శాతం మేర పెరిగినట్లు అధికారులు అంచనా వేశారు. మొత్తం మీద, దసరా పండుగ సీజన్ ఈసారి మద్యం సేల్స్‌లో రికార్డులు సృష్టించింది. పండుగ ఉత్సాహం, వినియోగదారుల డిమాండ్ కారణంగా అమ్మకాలు పెరగడంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభించిందని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.

PoK Protests: పీఓకేలో నిరసనలు.. మునీర్ సైన్యం దురాగతాలపై స్పందించిన భారత్..

Exit mobile version