దళిత బంధు పథకం కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం.. హాట్ టాపిక్‌గా మారింది. అయితే, సర్కార్ సైతం.. ఈ పథకాన్ని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తోంది. దళిత సమాజానికి ఈ పథకం గురించి వివరిస్తూ.. ప్రత్యేక పాటలు రూపొందించి ప్రచారం కల్పిస్తోంది. ఇప్పుడెక్కడ చూసినా.. దీనిపైనే చర్చ జరుగుతోంది. దళితుల సాధికారత కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి అద్భుతమైన పాటలతో… అంతే స్థాయిలో ప్రచారం కల్పిస్తోంది ప్రభుత్వం. నిజానికి.. ఈ పథకాన్ని ఈనెల 16న హుజురాబాద్ వేదికగా.. సీఎం కేసీఆర్ ప్రారంభించాల్సి ఉంది.
Also Read
కానీ, ఈ పథకం అమలుపట్ల కృత నిశ్చయంతో ఉన్న కేసీఆర్.. అంతకు ముందే అంకురార్పరణ చేశారు. తన దత్తత గ్రామం వాసాల మర్రిలోనే.. దీనికి శ్రీకారం చుట్టారు. అక్కడ అర్హులైన 76 దళిత కుటుంబాలకు 10లక్షల చొప్పున దళితబంధు సాయం ఇచ్చేశారు. దీంతో ఈ పథకంపై అంచనాలు రెట్టింపయ్యాయి. అంచనాలకు తగ్గట్టే.. ఈ పథకానికి పాటలతో ప్రచారమూ కల్పిస్తోంది ప్రభుత్వం. ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకణ్ణ స్వరం కూడా.. ప్రభుత్వం రూపొందించిన దళిత బంధు పాటల్లో జత కలిసింది. దళిత సోదరా అంటూ ఆయన పాడిన పాట అందరినీ అలరిస్తోంది. దళితుల్లో ఈ పథకంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక పాటల్ని రూపొందించినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
-
Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
-
Virat Kohli: ఇంగ్లాండ్‌కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే ‘కోచ్’గా మారిన కోహ్లీ!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..