NTV Telugu Site icon

Cyclone Fengal: తెలంగాణకు వర్ష సూచన.. చల్లబడిన హైదరాబాద్..

Cyclone

Cyclone

Cyclone Fengal: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్‌ తుఫాన్ తీరం దాటిందని భారత వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కాగా, ఈ రోజు (డిసెంబర్ 2) తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇక, తుఫాన్ ప్రభావంతో దక్షిణ తెలంగాణలో చలి తీవ్రత బాగా తగ్గిపోయింది. అలాగే, హైదరాబాద్‌లో రెండ్రోజుల క్రితం 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగ.. ప్రస్తుతం 21డిగ్రీల వరకు పెరిగింది. మరో రెండ్రోజులు ఇదే వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు.

Read Also: Mokshagna Teja : నందమూరి మోక్షజ్ఞ రెండవ సినిమా ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే..?

ఇక, రాత్రి హైదరాబాద్ నగరంలో వర్షం కురిసింది. ఈ రోజు ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. మరోవైపు, ఏపీలోని తిరుమలలో గోగర్భం జలాశయం రెండు గేట్లు ఎత్తి నీరు దిగువకు రిలీజ్ చేస్తున్నారు. కుమారధార, పసుపుధార, పాపవినాశనం, ఆకాశగంగా జలాశయాల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి పెరిగింది. రెండో ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు విరిగినట్లు తెలుస్తుంది. ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారిపోయింది.