Site icon NTV Telugu

సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో డ్రోన్స్‌పై నిషేధం.. ఎందుకంటే..?

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్స్ పై నిషేధం విధిస్తున్న‌ట్టు పోలీస్ క‌మిష‌న‌ర్ తెలిపారు.. రామచంద్రపురం ఇక్రిశాట్, ముంచింతల్ చిన్న జీయర్ ఆశ్రమం వద్ద డ్రోన్స్ పై నిషేధం ఉంటుంద‌ని.. రేపు ఉదయం 6 గంటల నుండి ఈ నెల 15వ తేదీ వ‌ర‌కు నిషేధాజ్ఞ‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని ఉత్తర్వులు జారీ చేశారు.. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, పర గ్లిడర్స్, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్‌ పై నిషేధం విధించారు.. 15వ తేదీ వరకు వీవీఐపీల రాక సందర్భంగా ఈ నిషేదాజ్ఞ‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని ఉత్తర్వులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌. కాగా, ప్ర‌ధాని మోడీ.. శ‌నివారం హైద‌రాబాద్ రానున్న విష‌యం తెలిసిందే.. ఇక్రిశాట్ను సందర్శించ‌నున్న ఆయ‌న‌.. ఆ త‌ర్వాత సాయంత్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ స‌మీపంలోని ముచ్చింతల్లో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సంద‌ర్భంగా 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని న‌రేంద్ర మోడీ ఆవిష్క‌రించ‌నున్నారు.

Read Also: ఉద్యోగుల స‌మ్మె, పెన్‌డౌన్‌.. హైకోర్ట్ కీల‌క వ్యాఖ్య‌లు

Exit mobile version