NTV Telugu Site icon

Telangana DGP Fake DP: తెలంగాణ డీజీపీ రవి గుప్తా వాట్సప్ డీపీతో సైబర్‌ ఫ్రాడ్‌..

Telangana Dgp Fake Dp

Telangana Dgp Fake Dp

Telangana DGP Fake DP: ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. మోసగాళ్లు రకరకాలుగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. గిఫ్ట్‌లు, కూపన్లు, కేవైసీల పేరుతో ఇప్పటి వరకు మోసం చేసిన మోసగాళ్లు… ఇప్పుడు రూటు మార్చారు. డ్రగ్ పార్శిల్ పేరుతో అమాయకులను టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. మీ పేరు మీద డ్రగ్ పార్శిల్ వచ్చిందని చెబుతున్నారు. తాజాగా.. సైబర్ కేటుగాళ్లు తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో ఫేక్ వాట్సాప్ డీపీని సృష్టించి మోసానికి పాల్పడ్డారు. ఓ వ్యాపారవేత్తకు అగంతకుడు వాట్సాప్ కాల్ చేశారు. ఆ కాల్ ను వ్యాపారవేత్త కూతురు చూసి అవాక్కైయ్యారు. కాల్ వస్తున్న డీపీకి తెలంగాణ డిజిపి రవి గుప్తా ఫోటోతో కాల్ రావడంతో నిర్ఘంతపోయారు. ఏం జరిగిందో అంటూ వెంటనే కాల్ లిప్ చేశారు. నిన్ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. తను అలాఏమీ చేయలేదని చెప్పినా వినలేదు.

Read also: Chit Fund Fraud: బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ.. బాధితుల ఆందోళన..

సాక్ష్యాధారాలు వున్నాయని తెలిపి బెదిరించారు. తెలంగాణ డీజీపీ రవి గుప్తా వాట్సప్ డీపీ ఉండటంతో నిజమే అని భావించిన ఆ యువతి భయాందోళనకు గురైంది. ఇది గమనించిన సైబర్ కేటుగాడు.. ఈ కేసు నుంచి తప్పించాలంటే వెంటనే రూ.50వేలు పంపాలని డిమాండ్ చేశారు. అయితే అప్పుడే కాల్ రావడం అంతటితో ఆగకుండా కేసు నుంచి తప్పించేందుకు డబ్బులు డిమాండ్ చేయడంతో ఆ యువతికి అనుమానం వచ్చింది. వెంటనే కాల్ కట్ చేసి పోలీసులకు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువతి ఫోన్ కు వచ్చిన వాట్సప్ కాల్ ను పరిశీలించారు. అయితే +92 కోడ్ తో వాట్సాప్ కాల్ వచ్చిందిన తెలిపారు. ఈ +92 కోడ్ ను పరిశీలించగా.. ఇది పాకిస్తాన్ కోడ్ అంటున్న సైబర్ పోలీసులు గుర్తించారు. ఇంటివంటి కాల్స్ ను లిప్ట్ చేయడం , వారితో వీడియో కాల్స్ మాట్లాడటం వంటివి లిప్ట్ చేయకుండా కట్ చేయాలని తెలిపారు. అలాంటి నెంబర్లను బ్లాక్ చేయాలని సూచించారు.
CM Revanth Reddy: నేడు తిరుపతికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కారణం ఇదీ..