Site icon NTV Telugu

Shamshabad Airport : ఎలా వస్తాయి రా ఇలాంటి ఐడియాలు.. డిటర్జెంట్ సర్ఫ్‌లో బంగారం

Untitled 12

Untitled 12

Crime: దొరికితేనే దొంగ. దొరికే వరకు దొరనే అనుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న.. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన సంఘటనలు కళ్ళ ముందు కనిపిస్తున్న.. పట్టుబడితే శిక్ష తప్పదని తెలిసున్న.. వాళ్ళ పంథా మాత్రం మార్చుకొవడం లేదు స్మగ్లర్లు. ముఖ్యంగా బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా బంగారం అక్రమ రావణాను అడ్డుకుని స్మగ్లర్స్ ఆటకట్టిస్తున్నారు. గతంలో గోల్డ్ స్మగ్లర్స్ ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్న ఘటనలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. వివరాలలోకి వేళ్తే.. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల దగ్గర 1600 గ్రాముల బంగారం దొరికింది.

Read also:Israel Palestine: 56ఏళ్లలో పది లక్షల పాలస్తీనియన్లను ఖైదు చేసిన ఇజ్రాయెల్.. ఎందుకంటే ?

కాగా నిందితులు బంగారాన్ని డిటర్జెంట్ సర్ఫ్‌లో ఉంచి అక్రంగా రవాణా చేసందుకు ప్రయత్నించారు. అయితే అధికారులు స్మగ్లర్స్ ఆటలు సాగనివ్వలేదు. స్మగ్లర్స్ ని గుర్తించిన అధికారులు నిందితుల దగ్గర నుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బంగారం విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుంది అని అధికారులు తెలిపారు. అలానే బంగారాన్ని అక్రంగా రవాణా చేసేందుకు ప్రయత్నించిన నిందితుల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారం అక్రమ రవాణా ఘటన చోటు చేసుకుంది. బిల్లు లేకుండా ఐదున్నర కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని మాదాపూర్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుల దగ్గర నుండి రెండు ద్విచక్ర వాహనాలు, బంగారాన్ని సీజ్ చేసిన మాదాపూర్ SOT పోలీసులు నిందితులను చందానగర్ పోలీసులకు అప్పగించారు .

Exit mobile version