సంగారెడ్డి జిల్లా లింగంపల్లి గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. వినాయక చవితి రోజున అపశృతి చోటు చేసుకుంది. గణేష్ మండపం కోసం ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యార్థికి కరెంట్ షాక్ తగలడంతో.. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి సాయిగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వినాయక చవితి సందర్భంగా మెదక్ జిల్లా టెక్మాల్ మండలం పాపన్న పేట గురుకుల పాఠశాలలో గణేష్ ఉత్సవాలు నిర్వహించేందుకు విద్యార్థులు సన్నాహాలు మొదలు పెట్టారు. మండపం ఏర్పాటు చేస్తున్న సమయంలో.. పదవతరగతి చదువుతున్న సాయి అనే విద్యార్థి కరెంట్ షాక్ కు గురయ్యాడు.
తోటి విద్యార్థులు గురుకుల ఉపాధ్యాయులకు సమాచారం అందించగా హుటా హుటిన సాయిని కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. సాయి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక సమాచారంతో గురుకుల పాఠశాలకు చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. విద్యార్థి సాయి మృతదేహాన్ని జహీరాబాద్ ఆసుపత్రి కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే సాయి మృతికి గురుకుల పాఠశాల సిబ్బందే అంటూ కుటుంబసభ్యులు పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థి బంధువుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Sonali Phogat: సోనాలీ ఫోగాట్ కేసులో మరో కొత్త ట్విస్ట్.. శరీరంపై 46 చోట్ల గాయాలు..
