Site icon NTV Telugu

CS Shanti Kumari: పోడు భూముల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలి.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు

Cs Shanti Kumari

Cs Shanti Kumari

CS Shanti Kumari Orders District Podu Land Documents To Farmers: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం జిల్లా కలెక్టర్లతో పోడు భూముల పట్టా పంపిణీ పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గృహలక్ష్మి పథకం, ఎరువులు, విత్తనాల నిల్వలు, తెలంగాణకు హరితహారం, బీసీ చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ పథకం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ వానాకాలంలో లబ్ధిదారులకు రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించాల్సి ఉన్నందున.. రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని, వారంలోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. పోడు రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను రైతు బంధు పోర్టల్‌లో జమ చేయాలని చెప్పారు.

Etela Rajender: మాటలు కోటలు దాటుతాయి, కాళ్లు మాత్రం తంగేళ్ళు దాటవు.. కేసీఆర్‌పై ఈటల ధ్వజం

రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని.. తాజాగా చెట్లను నరికివేయకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఎరువులు, విత్తనాల నిల్వల గురించి జిల్లా కలెక్టర్లు ప్రతిరోజూ పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు. జిల్లాలో తగినంత నిల్వలను అందుబాటులో ఉంచేందుకు గాను తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నర్సరీల్లో మొక్కలు అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి.. ఈ ఏడాది ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేపట్టేలా రైతులను ఒప్పించేందుకు.. రైతులకు అవగాహన కల్పించే వినూత్న మార్గాలను ఆలోచించాలని అన్నారు. అలాగే.. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల్లోని రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి, ఆ మిల్లులు ఏ సామర్థ్యంతో పనిచేస్తున్నాయో తెలుసుకోవాలని ఆదేశించారు.

Balka Suman: కాంగ్రెస్‌కు ఓటేస్తే చంద్రబాబుకి వేసినట్టే.. బాల్క సుమన్ ఫైర్

ఇంకుడు గుంతల పనులు పూర్తి చేయాలని, హరిత వనాలు, దశాబ్ధి సంపద వనాలపై దృష్టి పెట్టాలని శాంతికుమారి తెలియజేశారు. వర్షాలు కురవడం ప్రారంభించిన తర్వాత మొక్కలు నాటించాలని చెప్పారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు మొక్కలతో నిండి ఉన్న నేపథ్యంలో.. తోటలను ఎక్కడ చేపట్టాలనే దానిపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు. బీసీ చేతివృత్తిదారులకు ఆర్థిక సహాయం కింద అందిన దరఖాస్తులన్నింటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఇటీవల మంజూరైన 4,852 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలపై దృష్టి సారించాలని కలెక్టర్లను శాంతికుమార్ చెప్పుకొచ్చారు.

Exit mobile version