Love failure: దేశం కోసం పోరాడే జవాన్ ప్రేమకోసం బలయ్యాడు. ప్రేమ విఫలం కావడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ కోల్పోడంతో అన్నీ సూన్యంగా అనిపించాయి. సికింద్రాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. బేగంపేటలోని చీకోటీ గార్డెన్‌లో ఓ కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవేందర్‌కుమార్‌గా గుర్తించారు. దేవేందర్ సీఆర్పీఎఫ్ ఐజీ మహేశ్ లడ్డా నివాసంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Read also: 5G offers: ఎయిర్‌టెల్, జియోలపై వొడాఫోన్ ఫిర్యాదు
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రేమ వ్యవహారమే దేవేందర్ కుమార్ ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దేవేందర్ ఆత్మహత్యకు మరేదైనా కారణం ఉందా అని ఆరా తీస్తున్నారు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని సమాచారం ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.
5G offers: ఎయిర్‌టెల్, జియోలపై వొడాఫోన్ ఫిర్యాదు