వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. మేడారం సమ్మక్క-సారక్క జాతరను పురస్కరించుకొని భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడలో శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అంతేకాకుండా బద్దిపోచమ్మకు ఎంతో భక్తిశ్రద్దలతో, అంగరంగ వైభవంగా శివసత్తుల నృత్యాల నడుమ బోనాలు అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో నేడు.. వేములవాడ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.
దీంతో బద్ది పోచమ్మ ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. అంతేకాకుండా నేడు మాఘ అమావాస్య సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి వారి జాతర ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎంతో వైభవోపేతంగా జరుగనుంది. వేములవాడ రాజన్న దత్తత ఆలయం కావడంతో మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి జాతర ఏర్పాట్లు రాజన్న దేవస్థానం ఆధ్వరంలోనే జరుగుతాయి. అయితే మామిడిపల్లి జాతరకు భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
తాజావార్తలు
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
-
IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ ‘ఇరుముడి’ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
-
Vanda Devullu Trailer : ‘బిచ్చగాడు’ హీరో మూవీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్ చూశారా ? గుండెల్ని మెలిపెట్టే ఎమోషన్స్
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!