Crocodiles in Miralampond: ఇటీవల మీర్‌ఆలం ట్యాంక్‌లో మొసళ్లు, పాములు సంచరిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ మీర్ ఆలం ట్యాంకులో మొసలి ప్రత్యక్షమైంది. పాత బస్తీలోని మీర్ ఆలం ట్యాంక్ చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్డును తెరవడంలో జాప్యం చేయడంతో ఆ ప్రాంతం పాములు, తేళ్లు, మొసళ్లకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న , పెద్ద మొసళ్ల గుంపులు అప్పుడప్పుడు సరస్సు సమీపంలోని రాళ్లపై విశ్రాంతి తీసుకుంటూ.. స్థానిక నివాసితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయిన వాపోతున్నారు.
Read also: IND Vs BAN: వన్డే సిరీస్ పోయింది.. టెస్ట్ సిరీస్ అయినా పట్టేస్తారా?
మీర్ ఆలం ట్యాంక్ హస్సానగర్, ఇందిరానగర్, ఫాతిమానగర్ తదితర ప్రాంతాలకు ఆనుకుని నెక్లెస్ రోడ్డు ఆనుకుని ఉంది. దీంతో రోడ్లు బురదమయమై స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఈ సరస్సు నుంచి పాములు, తేళ్లు ఇళ్లలోకి వచ్చి చిన్న పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకుని సరస్సులోని మొసళ్లను అనువైన ఆవాసాలకు తరలించాలని స్థానికులు హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ)ని కోరారు. డంప్‌యార్డు పెరిగి డ్రైనేజీ నీరు నిలిచిపోయిందని స్థానికులు ఫిర్యాదు చేసినా ఇంతవరకు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
