NTV Telugu Site icon

Stephen Raveendra: బెట్టింగ్ ల ద్వారా… సైబర్ నేరగాళ్ల చేతుల్లో బ్యాంక్ అకౌంట్ లు

Stephen Ravindra

Stephen Ravindra

Stephen Raveendra: అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ గుట్టు రట్టు చేశారు సైబరాబాద్‌ పోలీసులు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్లను ఆసరాగా తీసుకుని బెట్టింగ్ లకు ఓ ముఠా పాల్పడుతుందని సమాచారం తెలిసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు పదిమంది సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేశారు. హైదరాబాదులో కాల్ సెంటర్ ఏర్పాటుచేసి దేశవ్యాప్తంగా బెట్టింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ప్రతినిత్యం కోట్ల రూపాయల లావా దేవీలు నిర్వహించడం, అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటు ఐపీఎల్ మ్యాచ్‌ లను బెట్టింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు పోలీసులు.

Read also: BIG Breaking: MLC కవిత కాలుకు ఫ్రాక్చర్… మూడు వారాల బెడ్ రెస్ట్..

అయితే దీనిపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసామని తెలిపారు. బాచుపల్లి సాయి అనురాగ్ అపార్ట్ మెంట్ లో క్రికెట్ బుకీలు అడ్డాగా చేసుకున్నారని అన్నారు. పది మంది బుకీలు అరెస్ట్ చేసామని, విజయవాడ కి చెందిన కీలక సూత్రధారి పాండు పరారీలో వున్నాడని స్పష్టం చేశారు. రూ. 60 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు, బ్యాంక్ అకౌంట్ లో వున్న ఐదు లక్షల 89 వేలను ఫ్రీజ్ చేసామని స్టీఫెన్‌ పేర్కొన్నారు. బెట్టింగ్ సామాగ్రి, సెల్ ఫోన్లు, కీ బోర్డ్స్ తో పాటు 10 మంది బుకీలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితులు అంతా హైదరాబాద్, ఆంద్రప్రదేశ్ కు చెందిన వారుగా గుర్తించామన్నారు. ఆర్గనైజింగ్ బెట్టింగ్ మూఠా ఎవరైతే బెట్టింగ్ ఆసక్తి ఉన్నవారో వారికి గాళం వేస్తూ.. లక్షల్లో దన్నుకుంటున్నారని తెలిపారు. బెట్టింగ్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్ చేయడం ద్వారా…బ్యాంక్ అకౌంట్ లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం వుందని స్పష్టం చేశారు. యువత ఇలా బెట్టింగ్‌ లకు అలవాటు పడి తమ జీవితాలను నాసనం చేసుకోవద్దని, ఇప్పటికైనా ఇలాంటి కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. క్రికెట్ బెట్టింగ్ ఒక వ్యసనమని, బెట్టింగ్ పెట్టి లక్షల్లో డబ్బును పోగొట్టుకొని చివరికి అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని తెలిపారు. తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలన్న దురాశతో డబ్బులు, ప్రాణాలు పొగుట్టుకుంటున్నారు. బెట్టిగ్ యాప్స్, బెట్టింగ్ ముఠాలకు దూరంగా ఉండాలని సూచించారు.
Fallen Pine Trees: గోల్ఫ్ టోర్నీలో కూలిన పైన్ చెట్లు.. ప్రేక్షకులలో గందరగోళం

Show comments