Credit card fraud: ఏకంగా 100కు పైగా క్రెడిట్ కార్డుల నుంచి దాదాపు రూ.5 కోట్లు స్వాహా చేసి మొత్తంతో పరారైన నవీన్ అనే యువకుడి భాగోతం దమ్మాయిగూడకు చెందిన కలకలం రేపుతోంది. కాల్ చేసిన ఎన్ని రోజుల అయినా స్పందించకపోవడంతో.. మోసపోయామని భావించిన బాధితులు స్వైప్ చేసి డబ్బులు ఇస్తానని ఎదురుచూసి మోసపోయామని గమనించిన 50 మంది యువకులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన దమ్మాయిగూడలో తీవ్ర కలకలం రేపుతోంది.
Read also: Revanth Reddy: రేవంత్‌పై చొప్పువిసిరే యత్నం.. ఇద్దరు అరెస్ట్
మొబైల్ షోరూమ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న నవీన్ మొదట్లో తన క్రెడిట్ కార్డును స్వైప్ చేసి కమీషన్ తీసుకోకుండా స్నేహితులకు నగదు ఇచ్చాడు. అతడిని నమ్మి స్నేహితులు అత్యాశకు గురయ్యారు. నవీన్ తమ వద్ద కమీషన్ తీసుకోకపోవడంతో మనమే క్రెడిట్ కార్డులు సేకరించి పదిశాతం కమీషన్ చొప్పున నగదు అవసరమైన వారికి అందజేద్దామనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు.దాదాపు 50 మంది యువకులు ఒక్కొక్కరు ఐదు లేదా ఆరు బ్యాంకుల నుంచి దాదాపు 100 క్రెడిట్ కార్డులను సేకరించి పిన్ నంబర్‌లతో సహా ఒకేసారి నవీన్‌కు ఇచ్చారు. ఒకేసారి ఇన్ని కార్డులు ఇవ్వడంతో నగదు ఇచ్చేందుకు వారం రోజులు గడువు కోరారు. వారం కాదు.. రెండు వారాలు గడిచినా అడ్రస్ లేదు. ఇంతలోనే తమ కార్డుల నుంచి స్వైప్ చేస్తున్నట్లు ఫోన్లకు మెసేజ్ లు రావడంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. తాను ఒక్కడినే రూ.కోటి డబ్బు కావాలని కార్డులు ఇచ్చినట్లు ఓ బాధితుడు రవి చెప్పుకొచ్చారంటే ఏ స్థాయిలో మోసం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.
Harassment: మూడో తరగతి బాలికపై లైంగిక వేధింపులు.. టీచర్ అరెస్ట్