Site icon NTV Telugu

CPI Narayana: కొత్త అప్షన్ వచ్చింది.. తెలంగాణ రాజకీయాలపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

Cpi Narayana

Cpi Narayana

CPI Narayana: మాకు తెలంగాణ లో కొత్త అప్షన్ వచ్చిందని సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికల్లో మోడీకి అవమానం జరిగిందని అన్నారు. ఇంత దిగజారిన ప్రధాని ని చూడలేదు.. ఇకపై రాడంటూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టారని, లౌకిక దేశానికి.. మోడీ ప్రధానిగా అనర్హుడని కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో బీజేపీని చితకొట్టారని అన్నారు. దక్షిణ భారత దేశం గేట్లు బీజేపీకి మూసేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఫలితాలు దేశానికి దిక్సుచి అని అన్నారు.

Read also: Shweta Tiwari : శ్వేతనాగులా ఉన్నావు.. నీకు 42ఏళ్లా.. నీ ఫిజిక్ సీక్రెట్ ఏంటి ?

తెలంగాణలో మాకు ఇంకో అప్షన్ వచ్చిందని, తెలంగాణలో పోటీ కాంగ్రెస్.. బీఆర్‌ఎస్‌ మధ్యనే అని కీలక వ్యాఖ్యలు చేశారు. మేమేం రాజకీయ సన్యాసం తీసుకోలేదని, మాక్కూడా సీట్లు కావాలని సీపీఐ నారాయణ అన్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో మాకు కొత్త అప్షన్ వచ్చిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ జాయింట్ యాక్షన్ లోకి రావడం లేదని కొన్ని రోజులు చూస్తామన్నారు. ఆ తరవాత మేము చూజ్ చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ పొత్తులపై చర్చ చేస్తామన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణ పైనా ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటక ఫలితాలతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కర్ణాటకలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. క‌ర్ణాట‌క‌లో అనూహ్యమైన విజ‌యం సాధించ‌డంతో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు, క్యాడ‌ర్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై కొంత ప్రభావం చూపుతుందని వస్తున్న వార్తలతో రాజకీయ దుమారం రేపుతుంది.
Ponguleti, Jupally: పొంగులేటి, జూపల్లి పయనంపై క్లారిటి వచ్చినట్టేనా..!

Exit mobile version