NTV Telugu Site icon

CPI Narayana: పవన్ ఓ రాజకీయ బ్రోకర్.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

Cpi Narayana On Pk

Cpi Narayana On Pk

CPI Narayana Fires On Pawan Kalyan For Joining Hands With BJP: జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై సీపీఐ నారాయణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏతో పవన్ కలవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మతవాద పార్టీ అయిన బీజేపీతో పవన్ చేతులు కలపడం.. ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి ప్రమాదకరమని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ బ్రోకర్‌లా మారారని.. టీడీపీని ఎన్డీఏకు దగ్గర చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ మధ్య అనుసంధానం చేసేందుకు పవన్ ఓ దళారీ అవతారమెత్తాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఆ రెండు పార్టీల్ని పవన్ కలిపితే.. ఏపీలో వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే అవుతుందన్నారు. బీజేపీతో జతకట్టిన కూటమికి వ్యతిరేకంగా.. మైనారిటీలందరూ ఏకమై, వైసీపీని గెలిపించడం ఖాయమని తేల్చి చెప్పారు.

MP Ranjith Reddy: కాంగ్రెస్‌పై ఎంపీ రంజిత్ ఫైర్.. ఎన్ని నిందలేసినా ప్రజలు నమ్మరు

గతంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పవన్ పోల్చారని.. ప్రత్యేక హోదా హామీ ఇచ్చి, ఆ హామీని ఇప్పటివరకూ నెరవేర్చని బీజేపీతో పవన్ ఎలా అంటకాగుతారని సీపీఐ నారాయణ ప్రశ్నించారు. నిన్నటిదాకా చేగువేరా దుస్తులు ధరించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు దారి తప్పి మితవాద సంస్కరణల సావర్కార్ వైపు నడవడం సరికాదని హితవు పలికారు. పవన్ వైఖరి చూస్తుంటే.. రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకోవడానికి కూడా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోందని దుయ్యబట్టారు. పవన్‌కి రాజకీయ స్థిరత్వం లేదని.. కదలకుండా మూడు నిమిషాలు మాట్లాడగలిగితే, ఆ తర్వాత పవన్‌ రాజకీయ స్థిరత్వం గురించి మాట్లాడుకోవచ్చని ఎద్దేవా చేశారు. తమతో పొత్తులు పెట్టుకోని ప్రాంతీయ పార్టీలపై సీబీఐ, ఈడీ సంస్థలతో దాడులు చేయించడం బీజేపీకి పవన్ మద్దతు పలకడం శోచనీయమని వెల్లడించారు.

Priya Prakash Varrier: స్లీవ్ లెస్ టాప్ ధరించి కాక రేపుతున్న ప్రియా ప్రకాష్ వారియర్