Site icon NTV Telugu

మన దేశం వైపు టెర్రరిస్టులు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది : సీపీఐ నారాయణ

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల దాడులకు సంబంధించిన అంశంలో భారత ప్రభుత్వం స్పందించాలి. టెర్రరిస్టులు మన దేశం వైపు కూడా చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది అని సీపీఐ నారాయణ అన్నారు. ముందే మనం కూడా మేల్కొంటే.. అందరికీ మంచిది. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేయాలని చూడటం దుర్మార్గం. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీనీ అమ్మేస్తున్నారు. కోవిడ్ సమయంలోనే అదానీ, అంబానీలు వందల కోట్లు సంపాదించుకున్నారు. ప్రధాని చెప్పేవన్నీ మాటలకే పరిమితం.. చేతల్లో మాత్రం అందుకు భిన్నం అని తెలిపారు.

స్వాతంత్య్ర దినోత్సవం ముందు రోజు పీడ కలను కూడా గుర్తు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇది హిందూ మతోన్మాదం రెచ్చగొట్టి.. తద్వారా ఎన్నికలలో లబ్ది పొందడానికే అప్పటి సంఘటనలను గుర్తు చేస్తున్నారు. మోడీ గడ్డం పెంచుకున్నంత మాత్రాన రవీంద్రనాధ్ ఠాగూర్ అయిపోరు అని పేర్కొన్నారు.

Exit mobile version