మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాకరేపుతోంది.. ఏ పార్టీ ఇస్తుంది.. ఏ పార్టీ పంచుతుంది అనే విషయం పక్కన పెడితే.. మద్యం ఏరులైపారుతోంది.. ఇక డబ్బులు వెదజల్లుతున్నాయి ఆయా పార్టీలు.. ఈ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు… ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి కాకుండా కార్పొరేట్ శక్తులకు కాపలాదారుడు అయ్యాడని ఆరోపించిన ఆయన.. ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నికలు వస్తాయి.. కానీ, మునుగోడులో ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు.. ఇక, బీజేపీ అభ్యర్థి డబ్బులు పెట్టకుండా గెలవగలడా..? అంటూ నిలదీసిన ఆయన.. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ ముందు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నిలబడటం లేదని వ్యాఖ్యానించారు.
Read Also: Bhupesh Baghel whipped: సీఎంకు కొరడా దెబ్బలు.. ఎందుకో తెలుసా..?
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డబ్బులు పంచుతూ.. బయటికి మాత్రం నేనేదో నీతిమంతుడిని అని చెప్తున్నారు.. బీజేపీ మునుగోడులో ధర్మయుద్ధం అంటుంది.. అది చేసేది మాత్రం అధర్మ యుద్ధం అని ఆరోపించారు కూనంనేని సాంబశివరావు.. ఒక పార్టీలో గెలిచి అవకాశ వాదం కోసం ఇంకో పార్టీలో చేరిన ఎమ్మెల్యే చేసేది ధర్మ యుద్ధం ఎట్ల అవుతుంది? అని నిలదీసిన ఆయన.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి అన్నదమ్ముల అనుబంధం రాజకీయాల్లో ఎందుకు? అన్నదమ్ములు ఇద్దరూ మోసగాళ్లు అంటూ ఫైర్ అయ్యారు.. నల్గొండ జిల్లాలో మోసకారులు ఎవరంటే కోమటిరెడ్డి బ్రదర్స్.. ఇద్దరు మాయగాల్లే.. వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి ఓటేయమనడం ఏం నీతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కూనంనేని సాంబశివరావు. కాగా, మునుగోడులో ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది.. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 6వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించింది ఎన్నికల కమిషన్.