Chada Venkat Reddy: మునుగోడులో అందుకే టీఆర్ఎస్కు మద్దతు.. క్లారిటీ ఇచ్చిన చాడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించింది సీపీఐ పార్టీ… కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం అయిన విషయం తెలిసిందే కాగా.. బైపోల్లో విక్టరీ కొట్టి.. బీజేపీ దూకుడు బ్రేక్‌లు వేయాలని భావిస్తోంది టీఆర్ఎస్.. దాని కోసం కలిసివచ్చేవారి మద్దతు తీసుకుంటుంది.. అందులో భాగంగా సీపీఐ మద్దతు కోవడం.. వారు కూడా అంగీకరించడం జరిగిపోయాయి.. ఇవాళ మునుగోడు సభలో సీఎం కేసీఆర్‌తో కలిసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు.. అయితే, మునుగోడులో టీఆర్ఎస్కు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు చాడ.. మీడియాలో మాట్లాడిన ఆయన.. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం గా వచ్చింది.. రాజగోపాల్ రెడ్డి స్వార్దం కోసం పార్టీ మారారు.. ఉప ఎన్నిక ప్రజలపై రుద్దారన్నారు. మేం మునుగోడులో నిలబడాలి.. కానీ, బీజేపీని ఓడించే వారికి మద్దతు ఇవ్వాలి అనుకున్నాం.. అందుకే.. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని క్లారిటీ ఇచ్చారు.
Read Also: Komatireddy Rajgopal Reddy: ఫామ్‌హౌస్‌లో పడుకున్న కేసీఆర్.. మునుగోడు రావాలనే రాజీనామా చేశా..
Also Read
ఇక, సెప్టెంబర్ 4 నుండి సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నాం.. రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణం పై చర్చ ఉంటుందన్నారు.. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ మాది.. తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లడుతున్న పార్టీ మాది అన్నారు చాడ వెంకట్‌రెడ్డి.. తెలంగాణ భవిష్యుత్ దృష్ట్యా మేం.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నామన్న ఆయన.. బీజేపీని ఓడించే శక్తి టీఆర్ఎస్కే ఉందన్నారు. అందుకే మేం టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చామని తెలిపారు.. బహిరంగ సభకి కేసీఆర్ మమ్మల్ని ఆహ్వానించారు.. ప్రగతి శీల శక్తుల ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. ఇక, భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం సీపీఎం కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన మూడు సీట్లలో కూడా పోటీ పెట్టిందని మండిపడ్డారు.. అప్పట్లో పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇబ్బంది పెట్టారు.. కాంగ్రెస్ లో బలంతో పాటు బలహీనతలు కూడా ఉన్నాయి.. కానీ, ఆ విషయాలపై ఇప్పుడు మాట్లాడబోనన్నారు చాడ వెంకట్‌రెడ్డి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!