సోషల్ మీడియా నెట్ వర్క్ ద్వారా దేశ ప్రముఖులు,ప్రజా ప్రతినిధులు, అధికారులు మీద కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కరీంనగర్ సీపీ సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జీఎస్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కొందరు విద్వేషాలనురెచ్చగొడుతున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఛానెల్ అని పెట్టి తమ లైన్ వక్రభాషను వాడుతున్నారని సీపీ అన్నారు.
Read Also: బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాయి: డి.రాజా
ఈ ఛానల్‌కు సంబంధించి శివరామిరెడ్డి మీద 4 కేసులు, మరో వ్యక్తి పై ఒక కేసు నమోదు చేశామని సీపీ వెల్లడించారు. సమాజంలో ఎవరికైనా ఇబ్బంది కలిగేలా సోషల్ మీడియా వేదికగా వక్ర భాషను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిస్టుల పేరుతో ఎవరు పడితే వారు ఎలాంటి అనుమతులు లేకుండా తిరుగుతున్నారని ఆరోపించారు.
