TS Covid Cases: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లో మళ్ళీ భయం మొదలైంది. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ వచ్చిన శాంపిల్స్ నీ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పుణె పంపుతున్నారు. త్వరలో గాంధీ ఆసుపత్రిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రారంభించనుంది. ఇప్పటికే చలి తీవ్రత తో శ్వాస సమస్యల కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా కూడా సీరియస్ గా ఎవ్వరూ లేకపోవడం.. అంతా స్టేబుల్ గా ఉన్నారు. అయితే ఇదే సీజన్ లో ఎక్కువగా ఆస్తమా, COPD, కేసులు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ప్రజలు జలుబు, ఆస్తమాకు చాలా లైట్ తీసుకుంటున్నారు. దీంతో ఆసుపత్రులకు వెళ్లే వారికి ప్రతి ఒక్కరిని కోవిడ్ పరీక్షలకు నిర్వహిస్తున్నారు.
Read also: Aadudam Andhra: గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం: సీఎం జగన్
అలా ఏమైనా కోవిడ్ గా గుర్తించబడితే.. వారిని ఐసోలేషన్ వార్డ్ కు పంపుతామని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు. మెడిసిన్స్, పరికరాలతో సిద్ధంగా ఉన్నాయని అన్నారు. చెస్ట్ హాస్పిటల్ లో వైద్యులు , సిబ్బంది సన్నద్ధంగా ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. కాగా.. రాష్ట్రంలో మొత్తం 55 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైద్రాబాద్ జిల్లాలో 45 కేసులు నమోదయ్యాయి.. రంగారెడ్డి -3, సంగారెడ్డి-2, ఖమ్మం- 1, కరీంనగర్- 1, వరంగల్ -2, మెదక్ -1 గుర్తించారు అధికారులు. ఇక హైద్రాబాద్ లో ఉన్న పాజిటివ్ కేసుల్లో.. ఫీవర్ ఆస్పత్రి లో 5 పాజిటివ్ కేసులు కాగా.. చెస్ట్ హాస్పిటల్ లో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక నిలోఫర్ లో 2, మిగితా కేసులు గాంధీ ఆస్పత్రి తో పాటు ఇతర ఆస్పత్రుల్లో ఉన్నాయని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి లో 10 పాజిటివ్ కేసులు కాగా.. అందులో 8 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఒకరు అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ లో ఉన్నారు. మరొకరు మృతి చెందడంతో తొలి కరోనా మరణకేసుగా నమోదు అయ్యిందని వైద్యులు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా వాడాలని సూచించారు.
Corona : గత 24 గంటల్లో దేశంలో 412కొత్త కరోనా కేసులు.. మూడు మరణాలు