NTV Telugu Site icon

గ్రేటర్‌లో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా

తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. జిల్లాలో రోజురోజుకు కోవిడ్ కేసులు తగ్గుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. గడచిన 24 గంటల్లో 1,00,677 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,982 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 436 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఇదే అత్యల్పం. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఉద్ధృతి మరింత తగ్గే అవకాశముందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.