కరోనా వైరస్ కంటే, ఆ వైరస్ వలన కలిగే భయంతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారు. కరోనా సోకితే మరణం తప్పదనే భయంతో దిగులు చెంది జీవనాన్ని కోల్పోయి ఇబ్బందు పడుతున్నారు. కరోనా నుంచ కోలుకోవాలి అంటే మొదట మానసికంగా బలంగా ఉండాలి. స్వచ్చమైన వాతావరణం ఉండాలి. అప్పుడు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సామాజికంగా వారికి పూర్తి భరోసా అందివ్వాలి. ఇక ఇదిలా ఉంటే, వైరస్ మహమ్మారి గ్రామల్లోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తుండటంతో ప్రజల్లో భయాంధోళనలు చెందుతున్నారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని యత్నారం అనే అటవిగ్రామంలో మూడు రోజుల వ్యవధిలో 34 మంది కరోనా బారిన పడ్డారు. తమ వలన మిగతా వారికి ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయంతో గ్రామంలోని ఏడు కుటుంబాలకు చెందిన 20 మంది కరోనా బాదితులు అడవీని ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకున్నారు. అడవిలోనే ఉంటూ అక్కడే వంట చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. పూర్తిగా కోలుకున్న తరువాత తిరిగి గ్రామంలోకి వెళ్తామని బాధితులు చెబుతున్నారు.
కరోనా భయంతో అడవిలోనే ఐసోలేషన్…
