సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడ బొల్లారం మున్సిపాలిటీ 11వార్డ్ కౌన్సిలర్ ప్రమీల గౌడ్ (40) ఆత్మహత్య చేసుకుంది. గత కొద్దిరోజులుగా కుటుంబంలో కలహాలు తలెత్తాయి. దీంతో మనస్థాపం చెందిన ప్రమీల ఆత్మహత్యకు పాల్పడింది. కాసేపటిక్రితం తన గదిలో ఉరి వేసుకున్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం అందించగా.. సంఘటన స్థలానికి చేరుకున్న బొల్లారం సీఐ ప్రశాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని పటంచేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కౌన్సిలర్ ప్రమీల ఆత్మహత్య
