Gutha Sukender Reddy: తెలంగాణపై సమైక్యవాదుల కన్నుపడిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్గొండలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాలంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో చేతకాక తెలంగాణలో ప్రజలను మభ్య పెట్టి కెసిఆర్ ను అడ్డు తొలగించు కోవాలని మళ్ళీ కబ్జా చేసేందుకు వస్తున్నారని ఆరోపించారు. 2014 లో మోడీ అధికారంలోకి వచ్చాక ఏడు మండలాలు ఏపీలో కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రభుత్వాలను కూల్చేకుట్రలు, అనిశ్చితకరమైన వాతావరణం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
Read also: Medical Students: ఏపీలో వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్.. టీషర్టు, జీన్స్ ధరించరాదని ఆదేశాలు
అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లడమే కాకుండా ఐఏఎస్ అధికారులను సైతం జైలుకు పంపిన చరిత్ర వారిదని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ప్రధాని కన్ను తెలంగాణపై పడిందన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే మనకు శ్రీరామరక్ష అని చెప్పారు. దత్తపుత్రిక పాదయాత్ర చేస్తూ అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నదని విమర్శించారు. అధికారులను జైల్లో పెట్టేలా అవినీతి చేసింది దత్త పుత్రిక కుటుంబం కాదా అని ప్రశ్నించారు. అయితే.. మళ్లి ఇక్కడకు వచ్చి నీతులు మాట్లాడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Praja Sangrama Yatra: 5వ రోజు ప్రారంభమైన బండిసంజయ్ పాదయాత్ర.. రాంపూర్ లో రాత్రి బస
