Constable Saves Womens Life: ట్రైన్ నుంచి దూకిన మహిళ.. కాపాడిన కానిస్టేబుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్యకాలంలో రైల్వే ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. అయితే, సకాలంలో స్పందించిన పోలీసులు ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. తాజాగా వరంగల్ లో ఓ కానిస్టేబుల్ చేసిన పనికి అందరిచేత ప్రశంసలు లభిస్తున్నాయి. 20 మంది సభ్యుల బృందం కృష్ణా ఎక్స్ ప్రెస్ లో తిరుపతి నుంచి వరంగల్ వస్తోంది. వరంగల్ జిల్లా భీమారం గ్రామానికి చెందిన ఒక మహిళ కృష్ణా ఎక్స్ ప్రెస్ లో తిరుపతి నుంచి వరంగల్ వస్తుండగా ట్రైన్ వరంగల్ లో ఆగిన సందర్భంలో దిగలేకపోయింది. ట్రైన్ కదిలిపోయింది. అయితే, ఆమహిళ రన్నింగ్ ట్రైన్ నుంచి ఫుట్ బోర్డు మీద వేలాడుతూ.. ప్లాట్ ఫాం మీదకి దూకేసింది.
ఆ సమయంలో ఆమె పట్టాలమీద పడబోయే సమయంలో అత్యంత చాకచక్యంగా అక్కడే విధుల్లో వున్న కానిస్టేబుల్ చిన్నరామయ్య ఆమెను ఒడుపుగా పట్టుకుని ప్లాట్ ఫాం మీదకి లాగేశారు. ఆమెతో పాటు కానిస్టేబుల్, మరో ప్రయాణికుడు కింద పడ్డారు. ఆసమయంలో కానిస్టేబుల్ చిన్నరామయ్య స్పందించకపోయి వుంటే దురదృష్టం ఆమెని వెంటాడేది. విధి నిర్వహణలో ఎంతో సాహసం, మానవత్వం చూపించిన చిన్నరామయ్యను ప్రయాణికులు, రైల్వే అధికారులు అభినందించారు. చిన్న రామయ్య జాతీయ అథ్లెట్. క్రీడారంగంలో పనిచేసిన చిన్నరామయ్య సెకన్ల వ్యవధిలో స్పందించి ప్రమాదం నుంచి మహిళను కాపాడారు. గతంలోనూ వరంగల్ రైల్వేస్టేషన్లో ఓ యువకుడిని రైలు కింద కుండ పడకుండా కాపాడారు రైల్వే పోలీసులు. రైలు ప్రయాణంలో అప్రమత్తంగా వుండాలని ప్రమాదాల బారిన పడకుండా తమను తాము రక్షించుకోవాలని రైల్వే, పోలీసులు కోరుతున్నారు.
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!