NTV Telugu Site icon

Constable Preliminary: అయ్యో కొడుకా.. మమ్మల్ని వదిలి వెళ్లిపోయాావా?

Constable Preliminary Exam

Constable Preliminary Exam

Constable Preliminary Exam: ఖాకీ దుస్తులు ధరించి సమాజానికి సేవ చేయాలనే యువకుడి కల నెరవేరలేదు. ఆశయ సాధనలో ఓడిపోయానని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో మూడు మార్కులు తక్కువ వచ్చినందుకు వరంగల్ జిల్లాకు చెందిన జక్కుల రాజ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. కొడుకు తెలియని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వికలాంగుడైన కొడుకు అండగా నిలుస్తాడని ఆశించిన కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది. ఐనవోలు మండలం సింగారంకు చెందిన జక్కుల రాజ్‌కుమార్‌కు చిన్నప్పటి నుంచి పోలీస్‌ కావాలనే కోరిక ఉండేది.

Read also: Amigos: ఇంతకీ ఈ ముగ్గురూ ఎక్కడ కలుస్తారు?

ప్రిలిమినరీ పరీక్ష కోసం చాలా కష్టపడ్డాడు. రేయింబవళ్లు చదివారు. అయితే మూడు మార్కుల తేడాతో అర్హత సాధించలేకపోయాడు. ప్రభుత్వం 7 మార్కులు కలిపితే ఈవెంట్స్ కు అర్హత సాధిస్తానని ఎదురుచూసిన జక్కుల రాజ్. ఈవెంట్స్ పూర్తైనా ప్రభుత్వం నుండి ప్రకటన లేకపోవడంతో మనస్తాపం చెందాడు.. తీవ్ర నిరాశకు గురయ్యాడు. అతను నొప్పితో విలవిల్లాడాడు. తన కల తన కళ్లముందే శిథిలమైపోవడం చూసి తట్టుకోలేకపోయాడు. కానిస్టేబుల్‌ కాలేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జక్కుల రాజ్ కుమార్ మృతితో సింగారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Bandi Sanjay: 6 నెలల్లో ఎప్పుడైన ఎన్నికలు రావొచ్చు