NTV Telugu Site icon

Mulugu Seethakka: ఆమె ఫోటో ఈవీఎం పై కనిపించడం లేదు..! కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన..

Mulugu Mla Seetakka

Mulugu Mla Seetakka

Mulugu Seethakka: ములుగులో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి సీతక్క ఫోటోను అక్కడ స్పష్టంగా కనిపించేలా ప్రింట్ చేయాలని ఆరోపిస్తూ సోమవారం రాత్రి ములుగు రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీఓ అంకిత్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. దీంతో ఆర్వో కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ములుగు అసెంబ్లీ స్థానానికి వివిధ పార్టీలకు చెందిన 11 మంది అభ్యర్థులు, స్వతంత్రులు పోటీలో ఉన్నారు. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నందున అభ్యర్థుల ఫొటోలు, తమ పార్టీలకు కేటాయించిన గుర్తులతో కూడిన ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈవీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క ఫొటోలు సరిగా కనిపించకుండా చిన్న సైజులో ముద్రించారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆర్వో కార్యాలయం ఎదుట ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెదకుల అశోక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

Read also: Vijayashanti: మెదక్ లో విజయశాంతి ప్రచారం.. రోడ్‌ షోలో పాల్గొననున్న రాములమ్మ

సీతక్క ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఫొటోలను చిన్న సైజులో ముద్రించి బీఆర్‌ఎస్ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల అధికారులు వాపోయారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత పాటించాలని కోరుతూ ఆర్‌వో కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఇటీవల సీతక్క ఫొటోను ఏఆర్‌ఓ అధికారులకు అందజేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కార్యాలయం ఎదుట బైఠాయించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి అంకిత్ కార్యాలయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఫొటోలను సరిచేసి మళ్లీ ముద్రించి సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. వెంటనే పార్టీ ప్రతినిధులు ఫొటోలు తీసుకొచ్చి ఎన్నికల అధికారికి అందజేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలు ఆందోళన విరమించారు.
Koti Deepotsavam 2023 8th Day: కోటి దీపోత్సవంలో 8వ రోజు విశేష కార్యక్రమాలు ఇవే

Show comments