Congress Will Form Govt In Telangana And Center Says Uttam Kumar Reddy: తనకున్న సర్వే ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న ఐదు నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఉద్ఘాటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 84వ రోజుకి చేరుకుంది. గురువారం రాత్రి చందంపేట మండంలోని పాతూరు తండా స్టేజ్ వద్దకు భట్టి విక్రమార్క చేరుకోగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాదయాత్రకు స్వాగతం పలికి, సంఘీభావం ప్రకటించి, పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మండుటెండల్లో భట్టి విక్రమార్క 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం చాలా గ్రేట్ అని కితాబిచ్చారు. భట్టి పాదయాత్ర తమ కాంగ్రెస్ పార్టీకి సరికొత్త జోష్ తీసుకొచ్చిందని తెలిపారు.
Harish Rao: కాంగ్రెస్, బిజెపి వాళ్ళవి మాయమాటలు.. కన్ఫ్యూజ్ చేసి సీట్లు గెలవాలని చూస్తున్నారు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం.. ఈ ఉత్తమ్ ఎప్పుడూ కొట్లాడుతూనే ఉంటాడని అన్నారు. కొందరు అధికారులు గులాబీ కండువా కప్పుకోడమే తక్కువగా ఉందని విమర్శించారు. జనంలో ఉండి, పార్టీ కోసం పోరాడాలంటూ కార్యకర్తల్ని సూచించారు. ఇన్ని సంవత్సరాలైనా.. ఎల్ఎల్‌బీసీ పూర్తి చేయలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాళేశ్వరంపై పెట్టినంత శ్రద్ధ.. ఇక్కడి ప్రాజెక్టులపై కేసీఆర్ ఎందుకు పెట్టలేదని విమర్శించారు. ఇక్కడి ఎమ్మెల్యేపై ఎన్నో ఆరోపణలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి, ప్రజల మధ్య ఉండి, వారి కష్టసుఖాలు తెలుసుకోవాలన్నారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, చేపట్టబోయే పథకాల గురించి ప్రజలకు వివరించాలని తెలియజేశారు. తెలంగాణలో రానున్నది తమ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.