Unemployment protest: టీపీసీసీ ఆధ్వర్యంలో నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో విద్యార్థి, నిరుద్యోగ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఇక్కడ సుమారు వెయ్యి మంది నిరుద్యోగులు చేతిలో టపాకాయలు పట్టుకుని నిరసన తెలుపనున్నారు. అనంతరం నల్గొండ బైపాస్ నుంచి నల్గొండ పట్టణం వరకు మూడు కిలోమీటర్ల మేర నిరుద్యోగులు, విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం పెద్దగడియారం సెంటర్‌లో సభ నిర్వహించనున్నారు.
Read also: Delhi: ఆ భవనం మాకిచ్చేయండి.. ఏపీని కోరిన తెలంగాణ
ఈనెల 21న నల్గొండలో నిరసన ర్యాలీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ కార్యక్రమంపై తమకు ఎలాంటి సమాచారం లేదని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పగా, ఈ కార్యక్రమంపై తనతో ఎవరూ చర్చించలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీ ఉత్తమ్ మరో అడుగు ముందుకేసి ఏఐసీసీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ నేతలు రాష్ట్ర నేతలతో చర్చించి ఈ నెల 28న తేదీని ఖరారు చేశారు. ఈ సమయంలో ఉత్తమ్, వెంకట్ రెడ్డి ఈ కార్యక్రమాలకు హాజరవుతారా? లేదా? గురువారం సాయంత్రం వరకు అనుమానం ఉన్నా.. ఇద్దరూ సమావేశానికి హాజరవుతున్నామని చెప్పారు. ఈ మేరకు వారిద్దరూ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ కు సమాచారం అందించారు. అయితే నిరుద్యోగ నిరసన సభకు ఉత్తమ్, కోమటిరెడ్డి హాజరు అవుతారా? అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఒకే వేదికపై వీరు ముగ్గురు దర్శమిస్తారా? అనే దానిపై చర్చ జరుగుతుంది.
Inter students: ఇంటర్ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. మధ్యలో మానేస్తే ఫీజు వాపసు