Site icon NTV Telugu

V. Hanumantha Rao: రేవంత్ కు బిగ్ షాక్.. సిన్హా స్వాగతంలో వీహెచ్

Vh Hanumanth Rao

Vh Hanumanth Rao

నేడు విపక్షాల రాష్ట్ర పతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ తో పటు పలువురు టీఆర్ఎస్ నేతలు స్వయంగా బేగంపేట ఎయిర్పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలికారు. కాగా.. టీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హన్మంతరావు యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకడం ఆసక్తికరంగా మారింది. అయితే.. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పిలిపించిన వారితో మేము కలవం అని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దీంతో.. వి. హన్మంతరావు కలవడం చర్చనీయంశంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడి మాటను లెక్కచేయకుండా వీ.హెచ్ బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లడంతో కాంగ్రెస్ లో చిచ్చు చెలరేగుతోంది.

అయితే.. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వస్తున్న యశ్వంత్ సిన్హాను కలవబోమని.. ఈ గోడమీద వాలిన కాకి ఆ గోడ మీద వాలదూ అంటూ పరోక్షంగా టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్న సిన్హాతో తాము కలిసేది లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా అవే ఆదేశాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి. అయితే హైదరాబాద్ కు వచ్చిన యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ స్వాగత కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఎయిర్ పోర్టుకు రావడమే కాకుండా.. సీఎం కేసీఆర్ తో కలిసి యశ్వంత్ సిన్హాను కలిశారు. ఈ ఘటన ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. దీంతో రేవంత్ రెడ్డి ఆదేశాలను పట్టించుకోకుండా వీహెచ్ రావడంతో రేవంత్ రెడ్డికి షాక్ తగిలిందనే చర్చ సాగుతోంది.

Enugu Movie Review: ఏనుగు మూవీ రివ్యూ

Exit mobile version