NTV Telugu Site icon

CM Revanth Reddy: మోడీ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ చార్జీ షీట్.. విడుదల చేసిన సీఎం రేవంత్

Revanth Reddy Bjp

Revanth Reddy Bjp

CM Revanth Reddy: ప్రధాని మోడీ పదేళ్ల పాలనపై తెలంగాణ కాంగ్రెస్ చార్జీ షీట్ ధాఖలు చేసింది. ఇవాళ మధ్యాహ్నం 12.20 గంటలకు ఛార్జి షీట్ ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. పదేండ్ల మోసం- వందేడ్ల విధ్వంసం అంటూ చార్జీషీడ్‌ విడుల చేస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపారు. పదేండ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం అనే కాంగ్రెస్ చార్టీషీట్ ను సీఎం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ చార్జీషీట్ ఇవే..

తెలంగాణకు చేసిన ద్రోహం..

*మోడీ పార్లమెంట్‌ సాక్షిగా పదే పదే తెలంగాణ ఏర్పాటును ఎగతాలి చేశారు

*విభజన హామీలైన బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ అమలు చేయలేదన్నారు.

*811 టీఎంసీ కృష్ణా జలాలలో తెలంగాణకు దక్కాల్సిన వాటాను దక్కకుండా చేశారని పేర్కొన్నారు.

విద్యా సంస్థల ఏర్పాటులో మోసం

* తెలంగాణకు ఒక్క ఐఐఎం, ఐఐఐటీ, కేంద్ర యూనివర్శిటీ, మెడికల్ కాలేజీనైనా ఇయ్యలే.

* నవోదయ & కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటులో తెలంగాణపై వివక్ష M

 మోడీ జుమ్లాలు

* ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలిస్తాం

* 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం

* 2022 కల్లా అందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తాం

* 100 రోజుల్లో నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తాం

*నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తాం

*అవినీతిని పూర్తిగా రూపుమాపుతాం

*నోట్ల రద్దుతో నల్లధనం నిర్మూలన

* దేశ భూభాగంలో చైనా ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదు.

సామాన్యుడిపై ధరల మోత

* పదేండ్లలో బియ్యం, పప్పు, నూనె, పాలు, చక్కెర ధరలు మూడింతలు పెంపు.

* రూ.110 దాటిన పెట్రోల్, రూ.1200 దాటిన సిలిండర్ ధర.

నిధుల విడుదలలో వివక్ష

తెలంగాణ కేంద్రానికి రూపాయి పంపిస్తే, కేవలం 43 పైసలని మాత్రమే తిరిగిస్తున్నది. కానీ, బీహారు – రూ.7.06, యూపీకి రూ.2.73, అస్సాంకు రూ.2.63, మధ్య ప్రదేశ్ కు రూ.2.42 ఇస్తుంది

రైతు వ్యతిరేకి బీజేపీ

* లక్షకు పైగా రైతుల ఆత్మహత్య.

* రైతు రుణమాఫీ చేయలే కానీ, కార్పొరేట్లకు రూ.25 లక్షల కోట్ల రుణాల మాఫీ

ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేకి మోడీ

* కులగణనను వ్యతిరేకిస్తున్న మోడీ.

* రోజూ దళితులపై 157, ఆదివాసులపై 28 దాడులు.

దేశాన్ని అమ్మేస్తున్న మోడీ

* రూ.60 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కేవలం రూ.6 లక్షల కోట్లకే కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టిండు.

* స్విస్ బ్యాంకుల్లో మూడు రెట్లు పెరిగిన నల్లధనం. రూ.8,392 (2015) కోట్ల నుండి రూ.30,500 (2021) కోట్లకు పెరుగుదల.

దేశ సార్వభౌమత్వానికి భంగం

2000 చదరపు కిలోమీటర్లకు పైగా భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా.

ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్

* ఎలక్ట్రోరల్ బాండ్ల పేరుతో రూ. లక్ష కోట్ల భారీ స్కామ్.

*ప్రైవేటు కంపెనీల దగ్గర చందాలు వసూ చేసి ప్రాజెక్టుల మంజూరు, మరియు IT, CBI దాడుల నుండి రక్షణ.

Reliance Jio: ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా జియో..