NTV Telugu Site icon

Premsagar Rao: ఇందిరమ్మ ఇండ్లు తప్ప కేసీఆర్ కొత్తగా ఇచ్చిన ఇండ్లేమి లేవు

Premchand

Premchand

Premsagar Rao: ఇందిరమ్మ ఇండ్లు తప్ప కెసిఆర్ కొత్తగా ఇచ్చిన ఇండ్లేమి లేవని ప్రజలే చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కమిటి చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ స్ట్రాటజీ కమిటీ మూడోవ సమావేశం జరుపుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహాల రిపోర్టు వచ్చే వారం ఠాక్రే కు అందిస్తామన్నారు. ప్రతిపక్షాల వ్యూహాలకు దీటుగా మా వ్యూహాలు ఉంటాయని అన్నారు. తప్పకుండా మా భాధ్యత నెరవేరుస్తామన్నారు. తెలంగాణలో తూఫాన్లా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోందన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పార్టీ హాయంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు కాంగ్రెస్ పార్టీ హాయంలోనే ఉన్నాయన్నారు. ప్రస్తుతం వడ్ల కొనుగోలులో పెద్ద స్కాం జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళల సాధికారత పూర్తిగా కుంటు పడిందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు తప్ప కేసీఆర్ కొత్తగా ఇచ్చిన ఇండ్లేమి లేవని ప్రజలే చెబుతున్నారని అన్నారు. కేసీఆర్ బంధులన్ని ఆగిపోయాయని తెలిపారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. 75 నుంచి 80 సీట్లు సాధిస్తామన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలకు ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తుందన్నారు. రైతులకు పెద్ద పీట వేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాష్ట్రంలో 22 లక్షల కౌలు రైతులు ఉన్నారని, కేసీఆర్ ప్రభుత్వంలో కౌలు రైతులు మోసపోయారన్నారు. తెలంగాణలో 54 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయని తెలిపారు.

కోటి ఎనభై లక్షల మంది పని చేసుకొని బతుకున్నారని అన్నారు. కేసీఆర్ వచ్చాక అందరూ రోడ్డున పడ్డారని అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ తెలిపారు. దరిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా అందిస్తామన్నారు. డిసెంబర్ 10 లోపల పోలింగ్ పూర్తి అవుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో కూని అవుతున్న ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. పార్టీ మా మీద పెద్ద భాధ్యత పెట్టిందని, మా బాధ్యతలు తప్పకుండా నిర్వర్తిస్తామన్నారు. వచ్చేవారం మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకొని రిపోర్ట్ అధిష్టానానికి అందిస్తామన్నారు. కచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామన్నారు. ప్రజల అభిప్రాయాలు తీసుకొని ప్రజలకు అవసరమయ్యే మ్యానిఫెస్టోను రూపొందిస్తామని తెలిపారు. వ్యవసాయం చేసే రైతులను ప్రగాఢంగా నడుపుతామన్నారు. డిల్లీ వర్సెస్ తెలంగాణ అనే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. పొత్తుల ద్వారా మేము కొంత దెబ్బ తిన్నాం.. ఈ సారి పక్క ప్రాణాలికతో ప్రజల్లోకి వెళతామన్నారు. అవసరం అనుకున్న వారితో మాత్రమే పొత్తులు ఉంటాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలలు విశ్వాసం కోల్పోయారని మండిపడ్డారు. కేసీఆర్ కు భయం పుట్టుకుoది.. అందుకే వరస బెట్టి సభలు నిర్వహిస్తున్నారని తెలిపారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తులు అంశం అధిష్టానం చూసుకుంటది.. చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
US White House: వైట్‌హౌస్‌లో ఆంధ్రా విద్యార్థులు సందడి.. కారణం ఇదీ..