Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy: నన్ను కాంగ్రెస్‌ నుంచి వెళ్లగొట్టే కుట్ర..! ఇక్కడే ఉంటా.. ఇక్కడే చస్తా..

Venkat Reddy

Venkat Reddy

నన్ను కాంగ్రెస్‌ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ, నేను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటా.. ఇక్కడే చస్తా అని ప్రకటించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇవాళ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఉపఎన్నిక కసరత్తు మీటింగ్‌కు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదన్నారు.. ఏ మీటింగ్‌ జరిగినా నాకు సమాచారం ఇవ్వడం లేదు. నాకు ఆహ్వానం లేని మీటింగ్‌కు నేను ఎందుకు వెళ్తా? అని ప్రశ్నించారు. ఇక, చండూరులో సభలో నన్ను అసభ్యంగా తిట్టించారు. హోంగార్డుతో పోల్చారు. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని మండిపడ్డారు.. మరోవైపు.. నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. నన్ను అవమానిస్తే పార్టీ నుంచి వెళ్లిపోతాను అనుకున్నారు.. నన్ను వెళ్లగొట్టి కాంగ్రెస్‌ను ఖాళీ చేద్దామనుకుంటున్నారని విమర్శించన ఆయన.. ఈ పార్టీ నష్టపోతే.. ఐదో పార్టీలోకి వెళ్లాలని చూస్తున్నారు అని రేవంత్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.

Read Also: Komatireddy Venkat Reddy: మునుగోడు ఉప ఎన్నికలు.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన నిర్ణయం…

ఇక, మేం బ్రాండ్ షాప్ నడిపించే వాళ్ళం మా వల్ల ఏం జరుగుతుంది.. రేవంత్‌రెడ్డి ఐపీఎస్‌.. మేమంతా హోంగార్డులం.. మా వల్ల ఏం కాదని సెటైర్లు వేశారు.. భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు.. నేను హోంగార్డులమా..? అని ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి.. ఐపీఎస్‌ కదా.. రేవంత్‌రెడ్డే మునుగోడును గెలిపించుకోమని చెప్పండి అని వ్యాఖ్యానించారు. జానారెడ్డి కూడా హోమ్ గార్డు అన్నట్టే కదా? అని ప్రశ్‌నించారు.. మరోవైపు.. ఠాగూర్ రెండు రోజులు ఇక్కడ ఉండి.. కనీసం నాకు ఫోన్‌ చేయలేదు అని అసహనం వ్యక్తం చేశారు.. అన్ని విషయాలు సోనియా, రాహుల్‌ దగ్గరే తేల్చుకుంటా నని ప్రకటించారు..

ఆస్తుల విషయంలో చేస్తున్న విమర్శలపై కూడా స్పందించారు కోమటిరెడ్డి.. రేవంత్ రెడ్డి ఆస్తులు ఎన్ని… రాజగోపాల్ ఆస్తులు ఎన్ని లెక్క చూస్తే తెలుస్తుందన్న ఆయన… రాజగోపాల్ రెడ్డి ఎక్కడెక్కడ పని చేశారు అనేది చూపిస్తాడు.. రేవంత్ ఏం చేసి సంపాదించారు అనేది చెప్పాలని డిమాండ్‌ చేశారు.. 1987 నుండి ఎవరి ఆస్తులు ఎన్నో చూద్దాం.. నీ చరిత్ర ఏంది? మీరు అన్నా… కాదన్నా.. రాజగోపాల్ రెడ్డి తమ్ముడే.. అతడిని కూడా ఎందుకు అలా అనడం? అని ప్రశ్నించారు.. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..

Exit mobile version