రైతు అమరవీరుల పోరాటం తోనే మోడీ దిగొచ్చి చట్టాలను రద్దు చేశారు. మోడీ, కేసీఆర్ లు ఇద్దరు కార్పొరేట్ ల కాళ్లు మొక్కుతున్నారు అని కాంగ్రెస్ ఏమ్మెల్యే సీతక్క అన్నారు. రైతులపై సీఎం, పీఎం లకి నిజమైన ప్రేమ ఉంటే వెంటనే పూర్తిగా ధాన్యం కొనాలి అని సీతక్క పేర్కొన్నారు.
ఇక మధు యాష్కీ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. రైతులు, కాంగ్రెస్ పోరాటం చేయడం వల్లనే నల్ల చట్టాలు రద్దు అయ్యాయి. మోడీ, కేసీఆర్ లు ఇద్దరు దొంగలే.. రైతులను చంపిన మంత్రి కుమారుడిపైన చర్యలు తీసుకోవాలి. మంత్రిని బర్తరఫ్ చేయాలి. రాష్ట్రంలో పండించిన ప్రతి గింజ కొనాలి, అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను అడుకోవాలి అని సూచించారు.
